కాదేది కరోనాకు అనర్హం అన్నట్టు పరిస్థితి మారింది. ఏ దేశమేగినా.. ఎక్కడ చూసినా మహమ్మారి దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డ వారే కనిపిస్తున్నారు.. అంబానీ సంస్థ అయినా.. ఆంధ్రాలోని చిన్న పరిశ్రమ అయినా లాక్ డౌన్ తో కుదేలై ఉద్యోగులను వదిలించుకున్న పరిస్థితే కనిపిస్తోంది.
బ్రిటీష్ ఇంధన దిగ్గజ కంపెనీ ‘బీపీ’ కుదేలైంది. ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వెల్లడించింది. కరోనా వైరస్ విజృంభణతో లాక్ డౌన్ విధించారు. జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లపై వాహనాలు తిరగలేదు. చమురుకు డిమాండ్ పడిపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఆదాయం తగ్గి నిర్వహణ భారంతో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు పేర్కొంది.
ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా విభాగాలున్నాయి. ఉద్యోగులున్నారు. తాజాగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 15శాతం సిబ్బందిపై వేటు వేసేందుకు కంపెనీ రెడీ అయ్యింది. ఈ మేరకు 10వేల మంది ఉద్యోగులు కంపెనీ వీడే ప్రక్రియను తాము చేపట్టామని బీపీ సీఈవో బెర్నార్డ్ లూనీ ఉద్యోగులకు ఈమెయిల్ పంపారు.
ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మూతపడడం.. ఎయిర్ లైన్స్ విమానాలు ఎగరకపోవడంతో చమురు ధరలు పతనమై మైనస్ లోకి జారుకున్నాయి. ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలించిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. ఖర్చులు పెరిగి రుణాలు 600 కోట్ల డాలర్లకు చేరుకోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని బీపీ కంపెనీ తెలిపింది. అంతేకాదు.. ఈ ఏడాది సీనియర్ ఉద్యోగులకు వేతన పెంపు, బోనస్ లను నిలిపివేశామని తెలిపారు.