టెక్ దిగ్గజ కంపెనీలలో నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఆలస్యం అవుతుండటంతో ఫ్రెషర్లు తమ కెరీర్ గురించి ఆందోళన చెందుతున్నారు. ఆఫర్ లెటర్లు పొందిన ఆరు నెలల తర్వాత కూడా ఉద్యోగంలో చేరడానికి వారు ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థులంతా ఉద్యోగంలో చేరి తాము చదువు కోసం చేసిన విద్యా రుణాలను చెల్లించేయొచ్చని అనుకున్నారు. అయితే దిగ్గజ టెక్ కంపెనీలు తమకు ఆఫర్ లెటర్లు ఇచ్చి నెలల తరబడి గడిచినా తమను ఇంకా ఉద్యోగాల్లోకి తీసుకోకపోవడంతో ఆఫర్ లెటర్లు పొందిన వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
కేవలం విద్యా రుణాలు తీసుకున్నవారు మాత్రమే కాకుండా మంచి కంపెనీల్లో జాబ్ వస్తుందని అప్పటికే చేస్తున్న జాబ్‌ను వదులుకున్నవారు ఆందోళన చెందుతున్నారు. ఇలా 30,000 మంది ఆఫర్ లెటర్లతో ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. వీరంతా ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్ జెమిని, టెక్ మహీంద్రా వంటి దిగ్గజ సంస్థల్లోనే ఆఫర్ లెటర్లు పొందారని అంటున్నారు. అయితే వీరిని ఇంకా ఉద్యోగాల్లోకి చేర్చుకోకపోవడంతో వీరంతా నెలల తరబడి వేచిచూస్తున్నారు.
ముఖ్యంగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ.. ఇన్ఫోసిస్‌లో కొత్తగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా చేరాలనుకునే యువతకు మరోసారి నిరాశ తప్పలేదు. కొత్త ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ తేదీని ఇన్ఫోసిస్ మరోసారి వాయిదా వేసినట్లు సమాచారం. ఇప్పుడే కాకుండా గత నాలుగు నెలలుగా కొత్త ఉద్యోగులు చేరికను ఆ కంపెనీ వాయిదా వేస్తూ వస్తోంది. ఆఫర్ లెటర్లు అందుకున్నవారి ఆన్‌బోర్డింగ్‌కు మొదటిసారిగా ఈ ఏడాది సెప్టెంబర్ 12న చేరిక తేదీని నిర్ణయించారు. ఆ తరువాత దీన్ని ఈ ఏడాది డిసెంబర్ 19కి మార్చారు. ఇలా ఇన్ఫోసిస్ గత నాలుగు నెలల్లో నాలుగు సార్లు ఆన్‌బోర్డింగ్ తేదీని వాయిదా వేయడం గమనార్హం.
దీంతో ఉద్యోగంలో చేరి తమ విద్యా రుణాలు, చదువుల కోసం చేసిన ఇతర అప్పులు తీర్చేయొచ్చని ఆశలు పెట్టుకున్నవారు ఆందోళన చెందుతున్నారు. తాము ఉద్యోగంలో చేరడానికి జాయినింగ్ తేదీని ఇన్ఫోసిస్ సెప్టెంబర్ 12, అక్టోబర్, నవంబర్ 28, డిసెంబర్ 19 అంటూ ఇలా వాయిదాలు వేస్తూ పోతోందని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్ఫోసిస్ ఇలా తమ జాయినింగ్ డేట్‌ను వాయిదాల మీద వాయిదాలు వేస్తుండటంతో చాలా మంది అభ్యర్థులు ఉద్యోగం, ఆదాయం లేకుండా ఇంట్లో కూర్చోవాల్సిన దుస్థితి ఉందని వాపోతున్నారు.
మరోవైపు ఆర్థిక మాంద్యం వస్తుందన్న నిపుణులు సూచనలు, టెక్ కంపెనీలకు తగ్గిపోతున్న ప్రాజెక్టులు, ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో ప్రపంచంలో పెరిగిపోయిన భౌగోళిక ఉద్రికత్తలు తదితర కారణాలతో తమ ఆఫర్ లెటర్‌ను ఇన్ఫోసిస్ క్యాన్సిల్ చేస్తుందని చాలా మంది భయపడుతున్నారు. ఇటీవల కొత్తవారిని తీసుకున్న తరువాత టెక్ మహీంద్రా, విప్రో, వంటి కంపెనీలు సైతం ఆఫర్ లెటర్లు వెనక్కి తీసుకున్నాయని అంటున్నారు. ఇన్ఫోసిస్ కూడా ఈ కంపెనీల బాటలోనే నడిచే అవకాశం ఉందని చెబుతున్నారు,
కాగా ఐటీ కంపెనీల వాదన మరోలా ఉంది. తమ వ్యాపార అవసరాల ఆధారంగా డేట్ ఆఫ్ జాయినింగ్ కేటాయిస్తామని తేల్చిచెబుతున్నాయి. ఉద్యోగులు చేరికకు కనీసం 2–3 వారాల ముందు వారికి తప్పకుండా సమాచారాన్ని పంపిస్తామని చెబుతున్నాయి.
కాగా మరోవైపు పలుు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ దుర్వినియోగం చేస్తూ.. రెండు ఉద్యోగాలు చేసేవారిని తొలగిస్తున్నాయి.
కాగా మూన్‌లైటింగ్ (ఒకేసారి రెండు ఉద్యోగాలు) విధానంలో రెండు ఉద్యోగాలు చేసే వారిని గుర్తించిన విప్రో ఇటీవల 300 మందిని తొలగించి సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇతర కంపెనీలు కూడా విప్రో బాటలో నిడిచేందుకు సిద్దం అవుతున్నాయి.