జిల్లాకు ఒక మంత్రి...ఒక ఎంపీ... ఏడుగురు ఎమ్మెల్యేలు...?

Update: 2022-03-11 11:32 GMT
ఈ కూర్పు ఏంటి. ఈ మార్పు ఏంటి అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది జగన్ మార్క్ బిగ్  చేంజ్. ఏపీని పదమూడు జిల్లాలు కాస్తా ఇరవై ఆరు జిల్లాలుగా జగన్ మార్చేస్తున్నారు. దాంతో పాటు జిల్లాలను ఎంపీ సీటు ప్రాతిపదికన రూపురేఖలు ఇచ్చారు.  అలాగే ఎంపీ సీటు అంటే కచ్చితంగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటారు. సో ఇదీ టోటల్ గా చూస్తే ఏపీలో కొత్త జిల్లాల స్వరూపం, స్వభావం అన్న మాట.

కొత్తగా ఏర్పడబోయేవి దాదాపుగా అన్నీ కూడా చిన్న జిల్లాలు. అక్కడ  ఒకే మంత్రి, ఒకే ఎంపీ, వారి చుట్టూ ఏడుగురు ఎమ్మెల్యేలు. రాజకీయంగా గొడవలు పెద్దగా ఉండవని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. ఇక ఇరవై ఆరు జిల్లాలుగా మారబోతున్న క్రమంలో ఇరవై ఆరు మంది మంత్రులు ఇక మీదట ఉంటారన్న మాట. వారు ఎవరూ అన్నది అయితే ప్రస్తుతానికి సస్పెన్స్. కొత్త జిల్లాలు ఉగాది నుంచి ఏపీలో రాబోతున్నాయి.  అలాగే మంత్రి వర్గ విస్తరణకు ఉగాది డేట్ నే ఫిక్స్ చేశారని గట్టిగా ప్రచారం సాగుతోంది.

అలా కొత్త జిల్లాలతో  పాటే  కొత్త మంత్రులు కూడా వచ్చేస్తారన్నమాట.   సో అటు పరిపాలనను మంత్రులు చూసుకుంటారు అన్న మాట. కొత్త జిల్లాలు అంటే బాలారిష్టాలు చాలానే ఉంటాయి. దాంతో వాటిని కూడా ఎలా  పరిష్కరించాలో కొత్త మంత్రుల మీదనే పూర్తి భారమంతా ఉండబోతోంది అని అంటున్నారు. ఇదిలా ఉండగా కొత్త జిల్లాలు, కొత్త అమాత్యుల రాకకు కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంలో  ఏపీలో ఇపుడు ఎటు చూసినా సందడి అయితే మామూలుగా మాత్రం లేదు.

కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా ఎవరు వస్తారు, కొత్త మంత్రులు ఎవరు అవుతారు అన్న దాని మీద కూడా డిస్కషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఏది ఏమైనా పెద్ద జిల్లాకు ఇద్దరు మంత్రులను గతంలో తీసుకున్నా కూడా ఇద్దరూ జిల్లా కేంద్రంలోనే ఉండడం వల్ల మంత్రుల మధ్య ఆదిపత్య పోరు ఒక రేంజిలో సాగేది. ఇపుడు అలా కాకుండా జిల్లాకు ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్లుగా పంపకాన్ని జగన్ పూర్తి చేస్తున్నారు. దాంతో రాజకీయంగా చిక్కులు ఉండవనే భావిస్తున్నారు.

అదే టైమ్ లో ఎంపీల విషయం తీసుకున్నా వారి మధ్యన పోరు, అలాగే  మంత్రులతో అసలు ప‌డేది కాదు, ఇపుడు తమ జిల్లాకు తానే ఏకైక ఎంపీ కాబట్టి సదరు మంత్రి గారితో సర్దుకుంటే తనదైన రాజకీయ అధికార వాటా కూడా పేచీ పూచీ లేకుండా తగ్గే పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ కూర్పు వల్ల పార్టీని మరింత పటిష్టం చేయవచ్చు అన్నదే వైసీపీ అధినాయకత్వం వ్యూహంగా ఉంది.

ఎలా చూసుకున్నా మొత్తం ఏపీ అంతా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే ఉన్నారు కాబట్టి రానున్న రెండేళ్ల వ్యవధిలో కొత్త జిల్లాల మీద పూర్తిగా రాజకీయ  ఆధిపత్యం చ‌లాయించడానికి పూర్తిగా వీలు అవుతుందన్నదే వైసీపీ మాస్టర్ ప్లాన్.
Tags:    

Similar News