ఒక భార్య-ఆమెకు ఇద్దరు భర్తలు.. అయితే, ఇక్కడ తొలి భర్తకు రెండో భర్తకు మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో తొలి భర్తపై రెండో భర్త దాడి చేశాడు. ``నీకు ఇప్పుడు ఆమె చెల్లెలు అవుతుంది. భార్యకాదు. కాబట్టి నువ్వు ఆమెను చెల్లి అని పిలవాల్సిందే`` అని హుకుం జారీ చేశాడు. అంతేకాదు.. కొట్టాడు. తర్వాత.. ఏం జరిగింది? అసలు.. ఒక భార్యకు రెండో భర్త ఎలా వచ్చాడు.. చెల్లి అని పిలవాల్సిందేనని ఎందుకు కండిషన్ పెట్టాడు.. ఇలా.. ట్విస్టులపై ట్విస్టులు.. చోటు చేసుకున్న ఘటన చివరకు విషాదాంతంతో ముగిసింది. ఇది ఎక్కడోకాదు.. మనహైదరాబాద్‌లోనే జరిగింది.. తెలుగుసుకుంటే.. దీనిని ఎప్పుడు విని ఉండరనేది స్పష్టమవుతుంది.
ఏంటీ కథ?హైదరాబాద్‌లోని అంబర్‌పేట గోల్నాకకు చెందిన రావుల సాయి అలియాస్ నాగులసాయి వృతి రీత్యా బ్యాండ్ వాయిస్తుంటాడు. బ్యాండ్ పని లేనప్పుడు చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించేవాడు. ఇతని స్నేహితుడి ద్వారా చిక్కడపల్లికి చెందిన ఆర్తి అనే యువతి పరిచయమైంది. దీంతో 2014లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు, వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, మద్యానికి బానిసైన నాగుల సాయి.. నిత్యం భార్యతో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో వారిద్దరూ విడుకాలు తీసుకోకుండానే వేర్వేరుగా ఉంటున్నారు.
ఈ క్రమంలో ఆర్తి అన్న జితేంద్రపై నాగుల సాయి దాడి చేసి.. నీ వల్లే నా కాపురం పోయిందని పేర్కొంటూ.. చిత్తుగా కొట్టాడు. ఇది పోలీసులకు వరకు వెళ్లడంతో సాయిని ఏడాది పాటు జైలుకు తరలించారు. ఆ తర్వాత కోర్టు ధిక్కారం కేసులో మరో ఏడాది జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో జితేంద్ర భార్య(ఆర్తి వదిన) ఆర్తికి నాగరాజు అనే వ్యక్తిని పరిచయం చేసింది.
ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు విష్ణు జన్మించాడు. అంటే.. ఆర్తి.. తన తొలి భర్త సాయికి విడాకులు ఇవ్వకుండానే ఒక కుమారుడు ఉండగానే నాగరాజును పెళ్లి చేసుకుని.. మరో కుమారుడికి జన్మనిచ్చింది. అంతేకాదు.. ప్రస్తుతం ఆమె గర్భవతి కూడా!
ఇంతలోనే గత నెలలో నాగుల సాయి జైలు నుంచి బయటకు వచ్చాడు. తన భార్యతో రాజీ పడి కాపురానికి తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు. కానీ, ఆమెకు వివాహం అయిపోయిందని తెలుసుకుని.. ఆగ్రహంతో ఊగిపోయి, ఫోన్ చేసి నానా దుర్భాషలాడాడు. దీనిపై ఆర్తి రెండో భర్త నాగరాజు.. ఫైర్ అయిపోయి.. నాగులసాయిని చితకబాదాడు. ఈ నెల 7న నారాయణగూడ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద నాగులసాయిని అడ్డగించిన నాగరాజు.. తన భార్య ఆర్తీతో మాట్లాడినా, ఫోన్ చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించాడు.
ఇకపై ఆమె నీకు చెల్లెలి వరుస అవుతుంది కాబట్టి చెల్లి అని పిలవాలని చెప్పాడు. దీంతో అప్పటికి మౌనంగా ఉన్న సాయి.. తర్వాత కక్ష పెంచుకున్నాడు. ఆర్తి, ఇద్దరు కుమారులు, ఆమె రెండో భర్త నాగరాజును కూడా ఒకేసారి చంపాలని నిర్ణయించుకుని.. ఒక రోజు రాత్రి పెట్రోల్‌తో వచ్చి వారిపై కుమ్మరించి నిప్పు పెట్టాడు. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు, నాగరాజు చనిపోగా.. ఆర్తి గర్భంలో ఐదు నెలల శిశువు మృతి చెందింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక, యథాప్రకారం.. నాగుల సాయి ఊచలు లెక్కిస్తున్నాడు. ఇదీ.. స్టోరీ!! క్రైం థ్రిల్లర్లలో పరాకాష్టగా ఉన్న ఈ స్టోరీ మన మధ్యే జరగడం విస్మయాన్ని కలిగిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.