మరే దేశ ప్రధానికి ఎదురుకాని సిత్రమైన పరిస్థితి

Update: 2021-04-04 02:30 GMT
దేశంలో ఎన్నో ఎన్నికలు జరిగి ఉంటాయి. కానీ.. ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల సందర్భంగా దేశ ప్రధానికి ఎదురుకాని సిత్రమైన పరిస్థితి తాజాగా మోడీకి ఎదురవుతోంది. తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రచారానికి రావాలని మోడీని ఆహ్వానిస్తున్న డీఎంకే అభ్యర్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అదేంది? మోడీని ప్రచారానికి రావాలని అడిగితే.. అన్నాడీఎంకే అభ్యర్థులు అడగాలే కానీ డీఎంకే క్యాండిడేట్లు ఎందుకు అడుగుతారు? అన్న సందేహం కలుగుతుందా?

మీ డౌట్ లో ధర్మం ఉంది. కానీ.. ప్రధాని మోడీకి పంచ్ లు వేసేలా డీఎంకే అభ్యర్థుల ఎత్తుగడ ఇప్పుడు అందరిని ఆకర్షించటమే కాదు.. వారి రాజకీయ ప్రత్యర్థులు ఇరకాటంలో పడేలా వారి ప్రచారం సాగుతోంది. దేశం మొత్తం మోడీ మాటలకు ఊగిపోయినా.. తమిళులు మాత్రం ఆయన్ను పెద్దగా నమ్మరన్నది నిజం. ఆ మాటకు వస్తే.. మోడీ సర్కారు తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా.. తమిళులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తారు.

అయినప్పటికీ అధికార అన్నాడీఎంకే మాత్రం మోడీని తమ మిత్రుడిగా ఎంపిక చేసుకోవటం తెలిసిందే. అమ్మ మరణం తర్వాత పళనిస్వామిని సీఎం చేయటంలో తెర వెనుక పావులు కదిపింది మోడీషాలే అన్నది బహిరంగ రహస్యం. అందుకు తగ్గ రుణం తీర్చుకోవటానికి మిత్రుడిగా మారి.. తాజా ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి సభ్యులుగా పలువురు అభ్యర్థులు బరిలోకి దిగారు.

ఇలాంటివేళ.. ఓటర్లలో మోడీ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవటానికి వీలుగా.. డీఎంకే అభ్యర్థులు అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. తాము పోటీ చేసే నియోజకవర్గం పేరును ప్రస్తావించి.. తమ పేర్లను కూడా తెలిపి.. ప్రధాని మోడీ ప్రచారానికి రావాలని.. అలా వస్తే తాము గెలుస్తామంటూ ట్వీట్ పంచ్ లు వేస్తున్నారు. ఇలా ఒకరి తర్వాత మరొకరు చొప్పున చేస్తున్న ట్వీట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. తమిళులకు మోడీ మీద ఉన్న ‘అభిమానం’ ఎంతన్నది ఇట్టే తెలిసేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News