లాడెన్ కొడుకు ఇలా ఎంజాయ్ చేసేవాడంట!

Update: 2017-01-10 04:44 GMT
ఆల్ కాయిదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజాబిన్ లాడెన్ ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒబామా పేరు చెబితే అంతెత్తున లేచే అమెరికా అతడిని మట్టుపెట్టిన అనంతరం అతని కుమారుడిపై నిఘా పెట్టిందని తెలుస్తుంది. ఆ సంగతులు అలా ఉంచితే... తాజాగా ఈ జూనియర్ లాడెన్ గురించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి! సాదారణంగా అమెరికా అంటేనే హంజాబిన్ తన పళ్లు పట పటా కొరికేస్తాడని, ఆ దేశం పేరు చెబితేనే కళ్లెర్ర చేస్తాడని కథనాలు వస్తుండేవి. అయితే ఇతగాడికి అమెరికాపై ఉన్నది సిన్సియర్ కోపం కాదని, ఆ కోపంలో నిజాయితీ లేదని చెప్పే సంగతులు తాజాగా వెలుగు చూశాయి!!

అమెరికా అంటే అంతెత్తున లేచి పడతాడు అని అంతా భావిస్తున్న హంజాబిన్ లాడెన్ కుమారుడు... అమెరికా వస్తువులను ఎంజాయ్‌ చేస్తూ కనిపించడంతో పాటు.. అమెరికాకు చెందిన కోకాకోలా - మరికొన్ని అమెరికా మేడ్ వస్తువులను కూడా వాడుతూ ఎంజాయ్‌ చేసేవాడట. అఫ్గనిస్థాన్‌ లో అతడు ఉంటున్న ఇంటి కాంపౌండ్‌ లో అమెరికాకు సంబందించిన చాలా వస్తువులు కనిపించేవట. ఈ మేరకు హంజాబిన్ చిననాటి స్నేహితుడు అబ్దురహమాన్ ఖాదర్ ఈ విషయాలన్నీ వెల్లడించాడని.. హంజాబిన్ అమెరికాను ద్వేషిస్తాడు కాని, అమెరికా వస్తువులను కాదని ఖాదర్ చెప్పాడని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.

ఇదే క్రమంలో ఖాదర్ మరికొన్ని విషయాలు వెల్లడిస్తూ... సాధారణంగా లాడెన్ ఇంట్లోకి అలాంటి వస్తువులను అనుమతించేవారు కాదని, అయినపటికీ హంజాబిన్ మాత్రం ప్రతి రోజు వాటిని దొంగచాటుగా తెప్పించుకునే వాడని, అమెరికాకు చెందిన పొగాకు ఉత్పత్తులను కూడా అతడు తొమ్మిదేళ్ల ప్రాయంలో తీసుకొచ్చేవాడని తెలిపాడట. ఆ సంగతులు అలా ఉంచితే... ప్రస్తుతం 20ఏళ్ల వయసున్న హంజాబిన్ పై సెక్షన్ 1 కింద ఆంక్షలు విధించిన అమెరికా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 ప్రకారం అమెరికా రక్షణ, భద్రత కోసం హంజాబిన్ తో లావాదేవీలన్నింటినీ నిషేధించింది. కాగా, హంజాబిన్ ను ఆల్ ఖైదా సభ్యుడిగా ఆ సంస్థ నేత అల్ జవహరి 2015 ఆగస్ట్ 14న ప్రకటించిన సంగతి తెలిసిందే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News