తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీలో మరోమారు కలకలం రేగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న విద్యార్థుల ఆగ్రహం మరింతగా పెరిగే పరిణామాలు జరిగాయాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉస్మానియా యునివర్సిటీలోని హాస్టల్ రూముల్లో నీళ్లు దారగా కురిశాయి. దీంతో రాత్రి మొత్తం విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ గడిపారు. విద్యార్థి రూంలో కారుతున్న వర్షాపు నీళ్లతో స్నానం చేసి తన నిరసనను తెలిపాడు.
మంగళవారం రాత్రి పడిన వర్షానికి హస్టల్‌లోని గదులు బాత్ రూమ్ ల కంటే గోరంగా తయారయ్యాయని విద్యార్థులు మండిపడ్డారు. వందేళ్ల చరిత్ర కలిగిన యునివర్సిటిలో ఇలా నీళ్లు కారడం అవమానకరమని విద్యార్థులు ఆక్షేపించారు. ప్రభుత్వం యూనివర్సిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలాఉండగా, వందేళ్ల తరువాత హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి నగరం చిగురుటాకులా వణికిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం సాయంత్రం మొదలైన భారీ వర్షం అర్థరాత్రి వరకు కురిసింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ భారీ వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు చెట్లు - విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో ట్రాన్స్ ఫార్మర్లు - కరెంట్ లైన్లకు దూరంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. రికార్డ్ స్థాయిలో వర్ష పాతం నమోదైంది. తెల్లవారుజామున వరకు కురిసిన వర్షానికి హైదరాబాద్ మొత్తం చెరువును తలపించింది. 111 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. 1908 తర్వాత ఈ ఏడాది అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో అప్రమత్తమైన GHMC అధికారులు - సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసింది. GHMC సహాయక చర్యలు కొనసాగిస్తోంది. అన్ని శాఖల సిబ్బంది ఫీల్డ్ లోనే ఉన్నారు. వాటర్ లాగింగ్ ను క్లియర్ చేస్తూ… పరిస్థితులను చక్కదిద్దుతున్నారు.