కాలేజీ అన్నంతనే డ్రెస్ కోడ్ మీద సవాలచ్చ కామెంట్లు.. వాదనలు వినిపిస్తాయి. అసలు అలాంటి ఇష్యూనే తలెత్తని ఒక విశ్వవిద్యాలయంలో తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం విద్యార్థులకు షాకింగ్ గా మారటమే కాదు.. పెద్ద ఎత్తున వ్యతిరేకతకు తెర తీస్తోంది. యూత్ ను తెగ ఫీలయ్యేలా చేస్తున్న తమ నిర్ణయాన్ని విశ్వవిద్యాలయ అధికారులు సమర్థించుకుంటున్నా స్టూడెంట్స్ మాత్రం నో అనేస్తున్నారట.
ఇంతకీ ఆ కొత్త రూల్ ఏమిటంటే.. వర్సిటీలో ఆనందంతో కొట్టే చప్పట్ల మీద బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అభినందనకు.. ఆనందాన్ని తెలియజేయటానికి చప్పట్లు కొట్టే అలవాటున్న తీరును వెనువెంటనే మార్చుకోవాలన్న సిత్రమైన రూల్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది ప్రఖ్యాత వర్సిటీ ఆక్స్ ఫర్డ్.
ఎందుకింత విచిత్రమైన నిర్ణయాన్ని తీసుకున్నారన్న విషయంపై విశ్వవిద్యాలయ అధికారులు క్లారిటీ ఇస్తూ.. బ్రిటీష్ సంప్రదాయం ప్రకారం ఎవరినైనా అభినందించాలంటే నిశ్శబద్దంగా గాల్లో చేతులు ఆడిస్తారని.. దాన్ని జాబ్ హ్యాండ్స్ అంటారని.. నాటి సంప్రదాయాన్ని మరోసారి స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.
చప్పట్లు కొట్టటం వల్ల ఎగ్జైంటీ ఎక్కువ అవుతుందని.. అలాంటి సమస్యలు ఆరోగ్యానికి ఇబ్బందని చెబుతున్నారు. ఎగ్జైంటీ సమస్యను ఎదుర్కొనే వారికి ఈ నిర్ణయం లాభిస్తోందని చెబుతున్నారు. మరి.. చప్పట్లు కొట్టకుండా ఎలా? అన్న ప్రశ్నను అడిగితే.. దానికో సిత్రమైన సమాధానం ఇస్తున్నారు వర్సిటీ అధికారులు.
వారు చెప్పిన దాని ప్రకారం చప్పట్లు కొట్టొచ్చు. కానీ.. కండీషన్ ఏమంటే ఆ చప్పట్లు చప్పుళ్లు చేయకుండా కొట్టాలంటున్నారు. సంప్రదాయ బ్రిటీష్ పద్దతి అయిన గాల్లో నిశ్శబద్దంగా చేతులు ఊపే పద్దతిని కంటిన్యూ చేయాలంటున్నారు. ఈ నిర్ణయంపై అక్కడి విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.