ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషీత్ మరణ వార్త విన్నవారందరినీ కలిచి వేస్తోంది. చిన్న వయసులో దారుణం జరిగిందని వేదన చెందుతున్నారు. చేతికి వచ్చిన కొడుకు.. ఊహించని రీతిలో మరణించటంపై నారాయణ కుటుంబ సభ్యుల శోకం ఆపతరం కావట్లేదు. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి కారణమైన కారుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.
రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో మంత్రి నారాయణ కొడుకు నిషీత్ నడుపుతున్న కారు బెంజ్ కంపెనీకి సంబంధించింది. అత్యుత్తమ వాహన కంపెనీగా దీనికి పేరుంది. ఖరీదైన కారుగా పేరు ప్రఖ్యాతులతో పాటు.. భద్రతా పరంగా ఎలాంటి లోపం ఉండదని చెబుతుంటారు. ఇక.. తాజా ఉదంతంలో విషీత్ డ్రైవ్ చేసిన కారు బెంజ్ జి-63 మోడల్. తెలంగాణ రాష్ట్రంలో రిజిష్టర్ అయిన ఈ కారు నెంబరు టీఎస్ 07 ఎఫ్‌కే 7117. నిషీత్ నడిపిన కారు ఖరీదు రెండు కోట్ల రూపాయిలకు పైనే ఉంటుందని చెబుతున్నారు. బెంజ్ సిరీస్ లో అత్యున్నత శ్రేణికి చెందిన ఏఎంజీ సిరీస్ చెందిన కారు అయినప్పటికీ.. ప్రాణాలు కోల్పోవటం గమనార్హం. కారు ప్రయాణిస్తున్న అతి వేగమే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటానికి కారణంగా చెబుతున్నారు.
సాధారణంగా బెంజ్ లోని ఈ శ్రేణి కార్లకు భద్రత చాలా పటిష్టంగా ఉంటుంది. అయితే.. తాజా ఉదంతంలో కారు మొత్తం తీవ్రంగా దెబ్బ తినటంతో పాటు.. ఇంజిన్ భాగాలు సైతం మెలితిరిగిపోయిన వైనం చూస్తే.. అతి వేగంగా ప్రయాణించటంతో పాటు.. మెట్రో ఫిల్లర్ లాంటి బలమైన అబ్జెక్టివ్ ను ఢీ కొనటం కూడా ప్రమాద తీవ్రత మరింత పెరగటానికి కారణమై ఉంటుందన్న అభిప్రాయాన్ని పోలీసు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.