భారత్ లో కరోనా జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. దాదాపు ఈరోజుతో 12 లక్షలకు చేరువ అవుతోంది. ప్రతిరోజు 35 -40వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలోనే కేసుల్లో మూడో స్థానానికి చేరుకున్నారు.
ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ విషయంలో క్లారిటీ రావడం లేదు. డిసెంబర్ లోపు ఆక్స్ ఫర్డ్ టీకా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి నెల భారత్ లో 50 లక్షల డోసుల వరకు వినియోగించుకునే అవకాశం ఉంది.
ఇక సీరమ్ తోపాటుగా దేశంలోని మరికొన్ని ఫార్మా కంపెనీలు కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చేయడంలో నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఇక సీరమ్ ఇండియాలో ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేసినప్పటికీ విదేశాలకు కూడా సరఫరా చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాదాపు సగం డోసులు మాత్రమే భారత్ కు అందుతాయి.
పోలియో వ్యాక్సిన్ వేసినట్టుగా దేశంలోని 130 కోట్ల మందికి ఈ కరోనా వ్యాక్సిన్ వేసినప్పుడే అది మన దేశం నుంచి పారిపోతుంది. ఈ స్థాయిలో ఉత్పత్తి జరగాలంటే కనీసం మరో రెండేళ్లు పడుతుందని ఫార్మా కంపెనీలు చెబుతున్నాయి. అందరికీ టీకా వేయాలంటే భారత్ లో కనీసం నాలుగేళ్ల సమయం పడుతుందని చెబుతున్నారు.
ఇక కరోనా వైరస్ సోకిన వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ అందిస్తే సరిపోదని.. ప్రతీఒక్కరికి టీకాను వేయాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీన్ని బట్టి కరోనా ఇండియాకు దూరం కావాలంటే మరో నాలుగైదేళ్లు పడుతుందని చెబుతున్నారు. మరి ఇది ప్రపంచం నుంచి దూరం కావాలంటే ఇంకా ఎన్ని ఏళ్లు పడుతుందో ఊహించడానికే అంతుచిక్కని విషయంగా ఉంది.