భారత్ వింగ్ కమాండ్ అభినందన్ వర్ధమాన్ విషయంలో పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వాకు వెన్నులో వణుకు పుట్టిందా, ఒకవేళ అభినందన్ ను విడిచిపెట్టకపోతే భారత్ తమపై దాడికి సిద్ధమైందన్న వార్త వినగానే బాజ్వా కాళ్లు గజగజ వణికిపోయాయా , అంటే అవుననే అంటున్నాయి పాక్ వర్గాలు. ఆ దాడిలో వింగ్ కమాండర్ అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కాడు. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం గత ఏడాది మార్చి ఒకటో తేదీన పైలట్ అభినందన్ ను విడిచి పెట్టింది. వింగ్ కమాండర్ అభినందన్ ను విడిచిపెట్టేందుకు దారితీసిన పరిణామాలపై పాకిస్థాన్ ముస్లిం లీగ్ నేత అయాజ్ సాదిక్ ఆ దేశ జాతీయ అసెంబ్లీలో కొన్ని విషయాలను వెల్లడించారు.
వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను అరెస్ట్ చేయగానే పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఖురేషీ మాట్లాడుతూ... భారత్ మనపై దాడికి దిగుతుంది అని నేతలతో ప్రస్తావించారట. ఆ సమావేశంలో ఆర్మీ చీఫ్ జావేద్ బాజ్వా కూడా పాల్గొన్నారు. భారత్ దాడి చేస్తుందన్న మాట వినగానే బాజ్వా కాళ్లు గజగజ వణికిపోయాయి అని అదే సమావేశంలో పాల్గొన్న పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ నేత అయాజ్ సాదిఖ్ వెల్లడించారు. ఒకవేళ వింగ్ కమాండర్ అభినందన్‌ను రిలీజ్ చేయకుంటే, ఆ రోజు రాత్రి 9 గంటలకు భారత్ తమపై దాడి చేసే అవకాశం ఉన్నట్లు ఖురేషి చెప్పిన అంశాలను అయాజ్ సాధిక్ గుర్తు చేశారు.
విదేశాంగ మంత్రి ఖురేషి మాటలు విన్న ఆర్మీ చీఫ్ బాజ్వా కాళ్లు గజగజ వణికిపోయాయాని, ఆయనకు చమటలు పట్టేశాయని సాధిక్ తన ప్రసంగంలో గుర్తు చేశారు. అభినందన్ ను విడిచిపెట్టాలని విదేశాంగ మంత్రి ఖురేషి ఆర్మీని కోరినట్లు సాధిక్ తెలిపారు. ఖురేషి నేతృత్వంలో జరిగిన ఆ మీటింగ్‌లో ప్రధాని ఇమ్రాన్ పాల్గొనలేదు. రాత్రి 9 గంటలకు భారత్ దాడి చేయనున్నదని, దేవుడిపై దయ ఉంచి అభినందన్ ను రిలీజ్ చేయండి అంటూ ఖురేషి అన్నట్లు సాధిక్ తెలిపారు. వింగ్ కమాండర్ ను వదిలేందుకు విపక్షాలు కూడా సహకరించినట్లు ఆయన చెప్పారు. ఆ మీటింగ్ లో బాజ్వా కాళ్లు గజగజ వణికిపోతున్నాయి. ముచ్చెమటలు పట్టాయి అని వెల్లడించారు.
2019 ఫిబ్రవరి 27న భారత్, పాక్ మధ్య ఘర్షణల నడుమ భారత్ గగన తలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానం ఎఫ్-19ను అభినందన్ కూల్చివేశారు. అయితే, ఈ క్రమంలో అభినందన్ ప్రయాణించిన విమానం పాక్ భూభాగంలోకి వెళ్లి పేలిపోయింది. ఆయన పాక్ అధికారుల చేతులకు చిక్కారు. 2019 మార్చి 1న అటారి-వాఘా సరిహద్దుల్లో ఆయన్ను భారత్ కు పాక్ అప్పగించింది. అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన అభినందన్‌ను వీర్ చక్ర పతకంతో భారత్ సత్కరించింది.