పొరుగుదేశం పాకిస్తాన్ తన కుయుక్తులకు పదును పెట్టింది. వరుస దెబ్బల తర్వాత పాక్ మరో కుట్రకు తెరదీసింది. ఈ సారి నేరుగా కాలు దువ్వకుండా చైనాతో జతకట్టింది. భారత్ తలపై గల భూభాగంలోకి చైనా ప్రవేశించేందుకు అన్నిరకాలుగా సహాయ సహకారాలందిస్తోంది. భారత విభజన సమయంలోనే జమ్మూకాశ్మీర్ పైనున్న గిల్కిత్ -బాల్టిస్థాన్ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుంది. అప్పట్నుంచి ఈ ప్రాంతంపై భారత్ - పాక్ ల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవలె ఈ భూభాగాన్ని పాక్ తన ఐదవ రాష్ట్రంగా ప్రకటించుకుంది. దీన్ని భారత్ అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టింది. బ్రిటన్ పార్లమెంట్ కూడా గిల్జిత్ -బాల్టిస్థాన్ జమ్మూకాశ్మీర్ లో ఓ భాగం.. ఇది భారత్ కే చెందుతుందంటూ ఇటీవల ప్రకటించింది. భారత్ నుంచి బ్రిటన్ పాలకులు వైదొలిగే సమయంలో గిల్జిత్ -బాల్టిస్థాన్ తో సహా జమ్మూకాశ్మీర్ ను భారత్ కు చెందిన భూ భాగంగానే పేర్కొన్నట్లు బ్రిటన్ పార్లమెంట్ స్పష్టం చేసింది. దీన్ని పాక్ తన ఐదవ రాష్ట్రంగా ప్రకటించుకోవడాన్ని తప్పుబట్టింది.
తాజాగా గిల్జిత్ -బాల్టిస్థాన్ లోని కొంత భాగాన్ని చైనా ప్రభుత్వానికి అమ్మేందుకు పాక్ ఒప్పందం కుదుర్చుకుంది. చైనా - పాక్ లు ఇప్పటికే అంతర్జాతీయ సరిహద్దు వెంట ఎకనామిక్ కారిడార్ నిర్మాణం సాగిస్తున్నాయి. చైనా నుంచి గిల్జిత్ -బాల్టిస్థాన్ మీదుగా ఈ కారిడార్ సాగుతోంది. నేపాల్ - భూటాన్ ల అంతర్జాతీయ సరిహద్దుల మీదుగానే ఇది వెళ్తుంది. ఈ కారిడార్ వెంబడి రైల్వేలైన్ నిర్మాణానికి ఇప్పుడు చైనా ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా తన ఉత్పత్తుల్ని ఆసియా - యూరోప్ దేశాలకు మరింత వేగంగా - చౌకగా విక్రయించుకునేందుకు తంటాలు పడుతోంది. చైనా ప్రయత్నానికి పాక్ పూర్తిగా మద్దతిస్తోంది. అంతర్గత వ్యతిరేకతను కూడా పక్కనపెట్టి తన దేశ భూభాగం మీదుగా చైనా సైనిక పటాలాల రాకపోకలకు ఇప్పటికే అనుమతిచ్చిన పాక్ ఇప్పుడు గతంలో తాము ఆక్రమించుకున్న బాల్టిస్థాన్ లోని భూభాగాన్ని స్థానికుల ఇష్టాఇష్టాల్ని పట్టించుకోకుండా బలవంతంగా చైనాకు అప్పగిస్తోంది. ఈ ప్రాంతంలో చైనా తన మిలటరీ స్థావరాల ఏర్పాటుతో పాటు రక్షణ ఉత్పత్తుల కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం అక్కడున్న స్థానికుల్నిప్పటికే పాక్ ఖాళీ చేయించింది. వీర్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు బలవంతంగా తరలిస్తోంది.
ఈ భూముల్ని చైనాకు అమ్ముతున్న పాక్ అందుకు ప్రతిఫలంగా భారీగానే లాభపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కంటే కూడా గిల్జిత్ -బాల్టిస్థాన్ సుమారు ఆరురెట్లు పెద్దది. పైగా దీని చుట్టూ హిమాలయాలున్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన రక్షణ ప్రాంతం. ఇది జమ్మూకాశ్మీర్ తలపైభాగంలో ఉంటోంది. ఇక్కడ చైనా సైనిక బలగాల మోహరింపునకు ఇప్పటికే భారత్ తన అభ్యంతరాల్ని వ్యక్తం చేసింది. అయినప్పటికీ పాక్ మాత్రం తన దురాగతాల్ని ఆపడంలేదు. పాకిస్థాన్ అడుగులను గమనిస్తున్న మన ప్రభుత్వం త్వరలో సరైన చర్యలు తీసుకుంటుందని రాజకీయవర్గాలు చెప్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/