దాయాది దుర్మార్గం..మోడీ ఫ్లైట్ వెళ్లేందుకు నో చెప్పేసింది

Update: 2019-10-28 04:58 GMT
మాటలకు చేతలకు ఏ మాత్రం సంబంధం లేనోళ్లు చాలామందే చుట్టూ ఉంటారు. మనసులో విషాన్ని నింపుకొని.. అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడైనా సరే అదే తీరును ప్రదర్శించే దేశం ఏదైనా ఉందంటే.. మన ఇరుగున ఉండే దాయాది పాక్ ముందుంటుంది. భారత్ మీద తన అక్కుసును అదే పనిగా వ్యక్తం చేసే పాకిస్థాన్ తీరు రోజురోజుకూ మరింత పెరుగుతోంది.

ఈ మధ్యన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విదేశీ ప్రయాణంలో భాగంగా పాక్ గగనతలం మీదుగా వెళ్లాల్సి వచ్చింది. అందుకు అనుమతి కోరగా.. ఎలాంటి మొహమాటం లేకుండా నో చెప్పేసింది. తాజాగా సౌదీకి వెళ్లాల్సిన ప్రధాని మోడీ ప్రయాణించే విమానం పాక్ భూభాగం మీదుగా విమానం వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన అనుమతిని కోరిన భారత్ కు పాక్ నో చెప్పేసింది.

ఇదే విషయాన్ని పాకిస్తాన్ ప్రకటించింది. జమ్ముకశ్మీర్ లో ప్రస్తుతం మానవ హక్కుల ఉల్లంఘన తీవ్రంగా జరుగుతుందని.. అందుకే తమ గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు మోడీ విమానానికి అనుమతి ఇవ్వలేదంటూ తన అక్కసును వ్యక్తం చేసింది. ఈ రోజు ప్రధాని మోడీ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఆ దేశంలో జరిగే అంతర్జాతీయ వాణిజ్య సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా అగ్రనేతలతో ఆయన చర్చలు జరపనున్నారు.


Tags:    

Similar News