ఇండియన్ల సామర్థ్యాన్నే నమ్ముతున్న పాకిస్తానీయులు

Update: 2019-02-27 08:51 GMT
పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసి మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.. సర్జికల్ స్ట్రైక్స్ 2గా పిలుచుకుంటూ భారతీయులు దీనిపై సంబరాలు చేసుకుంటున్నారు.   పాకిస్తాన్ కి భారత్ తగిన బుద్ది చెప్పారంటూ భారత పైలెట్లను కొనియాడుతున్నారు.   అయితే ఈ దాడి తర్వాత ప్రపంచ ప్రఖ్యాత సమాచార దిగ్గజం గూగూల్ సెర్చ్ ఇంజిన్ లో పాకిస్తానీయులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరచడం విశేషం. ఈ మేరకు గూగుల్... పాకిస్తానీయులు ఎక్కువగా వెతికిన విషయం ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించేనని’ తాజాగా ప్రకటించింది.

ప్రస్తుతం గుగూల్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, బాలాకోట్, సర్జికల్ స్ట్రైక్స్, ఎల్వోసీ కీవర్డ్స్ ను ఎక్కువ సంఖ్యలో సెర్చ్ చేస్తున్నట్లు గూగుల్ పేర్కొంది.. అయితే పాకిస్తానీయులు ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్ గురించి తెలుసుకునేందుకే ఎక్కువు ఆసక్తి కనబరిచినట్టు తెలిపింది..

పాకిస్తాన్ లోని బాలకోట్ కు సంబంధించిన కీవర్డ్స్ ప్రస్తుతం గూగుల్ సెర్చ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి.  భారత్ లో మాత్రం సర్జికల్ స్టైక్ కీవర్డ్ ట్రెండింగ్ లో ఉందని గూగుల్ ప్రకటించింది. పాక్ లో ఉదయం  నుంచి ఈ  ట్రెండ్ 10గంటల వరకు కొనసాగింది.   పాకిస్తానీయులు  ఇండియన్ ఎయిర్స్ సామర్థ్యం గురించి తెలుసుకోవడానికే ఎక్కువ ఆసక్తి కనబరిచినట్లు గూగుల్ పేర్కొంది. దీనిని బట్టి పాకిస్తానీయులకు పాకిస్తాన్ ఎయిర్స్ ఫోర్స్ సామర్థ్యం కంటే ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్ సామర్థ్యం పైనే ఎక్కువ నమ్మకం ఉందని స్పష్టమవుతోంది. ఒక వేళ యుద్ధం వస్తే ఏమవుతుందోనని పాకిస్తానీయులు లెక్కలేసుకుంటున్నట్టు కనబడుతోంది. 
Tags:    

Similar News