జనసేన గత కొన్నాళ్ళుగా ఎంత హడావుడి చేస్తున్నా పార్టీలో చేరికలు మాత్రం పెద్దగా లేవు. ఎంతసేపూ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వంటి వారే కనిపిస్తున్నారు. ఇక ఏపీలో ఎన్నికలు రెండేళ్ళలో ఉన్నాయి. నియోజకవర్గాలలో బలమైన నేతలు జనసేన వైపు వస్తారా అంటే ఇప్పటిదాకా నిరాశ కనిపిస్తోంది.
అయితే సడెన్ గా జనసేనకు ఫుల్ హ్యాపీస్ ఇచ్చేలా ఒక కీలక పరిణామం జరిగింది. పవన్ కళ్యాణ్ ని విపరీతంగా విమర్శించే మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సొంత ఇలాకా గుడివాడలోనే జనసేన బోణీ కొట్టింది.
గుడివాడలో పాలంకి బ్రదర్స్ గా పేరున్న సారధి బాబు, మోహన్ బాబు తాజాగా జనసేన కండువా కప్పుకున్నారు. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఇంతకీ ఈ పాలంకి బ్రదర్స్ సంగతేంటి అంటే వారు గుడివాడలో బలమైన సామాజికవర్గానికి చెందిన వారు.
ఈ బ్రదర్స్ 2019 ఎన్నికల వేళ వైసీపీలో చేరి కొడాలి నాని గెలుపునకు సహకరించారు. గత మూడేళ్ళుగా వారు పార్టీలో కొనసాగుతున్నారు. అయితే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత ఆరోపణలు కొడాలి నాని చేయడం వల్లనే తాము పార్టీని వీడామని చెబుతున్నారు. అలా చేయవద్దు అని పదే పదే నానికి సూచించినా ఆయన వినిపించుకోవడం వల్ల పార్టీని వీడాల్సి వచ్చింది అంటున్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు చెబితే నాని గట్టిగానే రియాక్ట్ అవుతారు. ఆయన మీద బాగానే నోరు పారేసుకుంటారు. అలాంటి నాని ఇలాకా నుంచి కీలక నేతలు తమ పార్టీలో చేరడం జనసేనకు ఇపుడు పరమ సంతోషాన్ని కలిగిస్తోంది అంటున్నారు. మరి ఆరంభం మాత్రమే ముందు ముందు చాలా మంది కోటలు కదలిపోతాయని జనసేన నాయకులు చెబుతున్నారు. చూడాలి మరి ఎక్కడెక్కడ ఎవరిని జనసేన టార్గెట్ చేసిందో మరి.