మందు బాబులు..జర చూసుకోండి..! మద్యం షాపులు బంద్​..!

Update: 2021-02-08 07:50 GMT
మందు బాబులకు ఇది చేదు వార్త. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికలకు 48 గంటల ముందే మద్యం షాపులు మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.  మంగళవారం ఏపీలో 2,736 సర్పంచి, 23,754 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి. ఉదయం 6.30 నుంచి సాయంత్రం 3.30 వరకు ప్రజలు ఓటింగ్​లో పాల్గొననున్నారు.

అయితే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరపాలని ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌కు 48 గంటల ముందే మద్యం దుకాణాలు మూసేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌, కల్లు సొసైటీ నిర్వాహకులతో ఎస్ఈబీ అధికారులు సమావేశం నిర్వహించారు.

అయితే ఎక్కడా బ్లాక్​లో కూడా మద్యం అమ్మొద్దని ఎక్సైజ్​ అధికారులు ఆదేశాలు చేశారు. ఈ మేరకు తనిఖీలు కూడా ముమ్మరం చేశారు.మరోవైపు పోలింగ్​ తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. ఇప్పటికే పలు చోట్ల డబ్బు, మద్యం ఏరులై పారుతున్నది. ఓటర్లకు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు.
Tags:    

Similar News