విచారణలకు భయపడం... ఎన్నో చూశాం.. టీడీపీ

Update: 2019-05-28 14:13 GMT
ఐదేళ్ల టీడీపీ పాలనకు చరమగీతం పాడాలు ఏపీ ప్రజలు.. భారీ మెజార్టీతో భారీ సంఖ్యలో సీట్లు ఇవ్వడం ద్వారా వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పట్టారు.. అయితే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరుపుతామని ప్రకటించారు.. ప్రధానంగా రాజధాని భూములు వ్యవహారంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని అక్రమాలను వెలికి తీస్తామని చెప్పారు.. అలాగే మరో జాతీయ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవసరమైతే కుంభకోణాలపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు..

దీనిపై టీడీపీ నేతలు ఎవ్వరూ స్పందించలేదు.. కానీ టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మాత్రం.. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటామని.. గతంలో అక్రమాలు జరిగాయని గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వైసీపీ నేతలు వెళ్లి భంగపడ్డారని అంటున్నారు.. ఓ టీవీ చర్చలో మాట్లాడుతూ .. ఎవ్వరికి భయపడం తప్పు చేస్తే భయపడాలి.. రాజధాని లో భూ సేకరణ, భూముల కేటాయింపు అంతా నిబంధనల మేరకే జరిగిందని ఎలాంటి విచారణనైనా ఎదుర్కోంటామని సవాల్ విసిరారు.. గతంలో చంద్రబాబుపై ఇలాంటి పోరాటమే చేశారని.. 17 కేసుల్లో చంద్రబాబుకు ప్రమేయం లేదని కోర్టులు తేల్చాయని పంచుమర్తి అనురాధ అన్నారు...

జగన్ ప్రభుత్వానికి కొద్ది రోజులు సమయం ఇద్దామని.. ఎవ్వరూ ఏమీ మాట్లాడవద్దని ఇప్పటికే మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.. మరి అనురాధ మాత్రం ఈ విధంగా మాట్లాడ్డంపై టీడీపీలో చర్చ జరుగుతోందంటున్నారు...
Tags:    

Similar News