ఇచ్చిందేదీ ఆమెకు సంతృప్తి కలిగించదట

Update: 2015-12-04 06:02 GMT
రాజకీయాల్లో కష్టపడి పని చేయటం.. పార్టీ పట్ల అంతులేని విధేయతను.. విశ్వాసాన్ని ప్రదర్శించటం ఎంత కీలకమో.. అవకాశం లభించటం అంతే కీలకం. దీనికి కాలంతో పాటు.. అదృష్టం కూడా కలిసి రావాలి. అవకాశం వచ్చినా అదృష్టం లేకపోతే.. నోటి వరకూ వచ్చిన ముద్ద కూడా చేజారి పోతుంది. అలాంటి ఎన్నో ఉదాహరణలు సమకాలీన రాజకీయాల్లో కనిపిస్తాయి.  

అధినేత నచ్చి.. మెచ్చి పదవులు కట్టబెట్టినప్పుడు విధేయతతో వాటిని తీసుకొని.. తనకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తమ సత్తాను చాటుకునేనేతలు కొందరైతే.. వచ్చిన అవకాశాన్ని చేజేతులారా చెడగొట్టుకునే వారు ఇంకొందరు ఉంటారు. అలాంటి జాబితాలో కనిపిస్తారు తెలుగుదేశం పార్టీ మహిళా నేత పంచుమర్తి అనురాధ. గతంలో ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అప్పుడు అవగాహనారాహిత్యంతో తనకిచ్చిన ఎమ్మెల్సీ అవకాశాం ఎడాపెడా మాట్లాడేసి.. అధినేత అగ్రహానికి గురై.. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్న వైనం కనిపిస్తుంది.

అలాంటి ఆమెకు మరోసారి అవకాశం దక్కి.. తాజా నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఆమెను ఏపీ మహిళా ఆర్థిక సంస్థకు చైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చారు. తాను ఎమ్మెల్సీ పదవినే వద్దంటే.. ఇప్పుడీ నామినేటెడ్ పదవి ఏంటన్న అసంతృప్తిని తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారట. ఇలాంటి తత్వమే గతంలో ఎమ్మెల్సీ అవకాశాన్ని పోగొట్టిందని.. ఇప్పుడీ నామినేటెడ్ పదవి చేజార్చుకోవటం మంచిది కాదని.. దక్కిన దానికి సంతృప్తి చెంది.. భవిష్యత్తు పట్ల ఆశావాహ దృక్ఫధంతో వ్యవహరించాలని.. ఇలా అసంతృప్తితో ఎలాంటి ఏమీ సాధించలేదన్న సూచన వినిపిస్తోంది.

రాని దాని కోసం తపించే కంటే.. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని.. దాని సాయంతో మరింత పైకి వచ్చేలా ప్లాన్ చేస్తే బాగుంటుంది. లేనిపక్షంలో.. అసలు అవకాశమే రాకుండా పోతుందన్న విషయాన్ని పంచుమర్తి అనురాధ గుర్తిస్తే మంచిది.
Tags:    

Similar News