మీడియాలో ప్రచారం కోసం...తమకు అనుకూలమైన వాదనలు ప్రచారంలో పెట్టేందుకు అక్రమ దారులను కూడా ఎంచుకుంటారనే అపప్రదను మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు తాజాగా అలాంటి ఎపిసోడ్ లోనే అడ్డంగా బుక్కయ్యారు. మత్తు పదార్థాల విషయంలో..ఓ మహిళా నేత ప్రదర్శించిన అత్యుత్సాహం ఆమె మెడకు చుట్టుకుంది. టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఇలా ఇరకాటంలో పడ్డారని ప్రచారం జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతోందని - దీనిని అరికట్టేందుకు సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం సమీపంలోనే ఇలా జరుగుతోందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఓ వీడియో ప్రదర్శిస్తూ...తాడేపల్లికి చెందిన ఓ మహిళ తన కుమారుడు గంజాయికి బానిస అయిపోయాడని - ప్రభుత్వం - అధికారులు ఏం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఇలాగే కొనసాగితే...తనకు చావు తప్ప మరోగతి లేదని ఆ మహిళ వాపోయిన ఉదంతాన్ని సైతం విలేకరుల సమావేశంలో పంచుమర్తి అనురాధ ప్రదర్శించారు.
ముఖ్యమంత్రి నివాసాన్ని పేర్కొంటూ టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఆరోపణలు చేయడం - ప్రభుత్వంపై విరుచుకుపడటంతో అధికారులు - పోలీసులు సదరు మహిళల గురించి ఆరా తీశారు. ఆమెను - ఆమె కుమారుడిని సైతం విచారించారు. అయితే - ఈ క్రమంలో సంచలన వివరాలు తెలిశాయి. తమ వద్దకు వచ్చిన పంచుమర్తి అనురాధ తాడేపల్లిలో గంజాయి అమ్మకం జరుగుతోందని చెప్పాలని కోరారని - తాము ఆ మేరకు ఆమె చెప్పిన విషయాన్ని వల్లె వేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు ఆమెపై కేసు బుక్ చేయాలని అదే సమయంలో...గంజాయి అంతు చూడాలని ఆదేశించినట్లు సమాచారం.