మహారాష్ట్ర, తమిళనాడుల్లో భయంకరంగా విస్తరిస్తున్న వైరస్

Update: 2020-06-30 02:30 GMT
మహారాష్ట్ర- తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా ఊహించిన దానికంటే ఘోరంగా పాకుతోంది. దేశంలో 40 శాతం పైగా కేసులు ఇక్కడే వస్తున్నాయి. ఒకటి రెండు కేసులను బ్యానర్ వార్తగా చూసిన మనకు మహారాష్ట్ర కేసులు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. కేసులు పెరుగుతున్న తీరు చూసి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అసలు దీన్నుంచి తప్పించుకోగలమా? అని భయపడుతున్నారు.

ఇక తాజాగా ఈరోజు మహారాష్ట్రలో 5,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,883కు చేరింది. 24 గంటల్లో 181 మంది మరణించారు. నేటి మరణాలతో కలిపి ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 7,610 కి చేరింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా ప్రభావం తగ్గడం లేదు. దీంతో వేరే మార్గం లేక జూలై 31 వరకూ మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ను పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం.

ఇక తమళనాడు లో కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చెన్నై నగరం ఇప్పటికే లాక్ డౌన్లో ఉంది. కానీ ఫలితం శూన్యం. మొన్న లాక్ డౌన్ విధించే సమయానికే అన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసులు ఉండటంతో కేసుల పెరుగుదల రేటు ఆగలేదు. ఈరోజు తమిళనాడులో 3949 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తమిళనాడులో 85వేలు దాటింది. గతంలో తమిళనాడులో కేసులు ఎక్కువ నమోదైనా మరణాలు తక్కువగా ఉండేవి. ఇపుడు మరణాలు కూడా బాగా పెరిగిపోయాయి. ఒక్కరోజే తమిళనాడులో కరోనాతో 62 మంది మరణించారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 1141కి చేరింది.
Tags:    

Similar News