సమకాలీన రాజకీయాలు మహా ఆసక్తికరంగా మారుతున్నాయి. దురదృష్టం ఏమంటే గంభీరంగా ఉండాల్సిన సమయాల్లో ఆ విషయాన్ని వదిలేసి తమకు తగ్గట్లుగా వ్యాఖ్యలు చేయటం ఇప్పుడో అలవాటుగా మారింది. గతంలోనూ పొగడ్తలు ఉండేవి కానీ అవేమీ నేల విడిచి సాము చేసేలా ఉండేవి కావు. అందునా కీలక నేతలుగా ఉన్న వారు తమకు ఇష్టమైన వారిని.. తాము అనుకూలంగా ఉండే పక్షాన్ని భజన చేసినట్లుగా పొగిడే వారు కాదు. కాసింత సంయమనం పాటించేవారు.
పొగడ్తలోనూ..విమర్శలోనూ బ్యాలెన్స్ నిన్నటి మాట అయ్యింది. ఇప్పుడు ప్రేమ కలిగినా.. ద్వేషం రేగినా మాటల్లో ఆ విషయాన్ని కొట్టొచ్చినట్లు కనిపించేలా చేస్తున్నారు. తాజాగా అలాంటి పనే చేశారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం. అమ్మ మరణం తర్వాత అధికార అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభం.. అది కాస్త ఒక కొలిక్కి వచ్చి.. అంతర్గత కలహాలు ఒక కొలిక్కి వచ్చి.. ద్వేషాన్ని విడిచి తమిళనాడు ముఖ్యమంత్రిగా పళని.. ఉప ముఖ్యమంత్రిగా పన్నీర్ బాధ్యతల్ని పంచుకోవటంతో కుదుపుల బాటను వదిలి.. సాఫీ రోడ్డు మీద జర్నీని షురూ చేసింది.
ఇదిలా ఉంటే.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే.. బీజేపీ పరివారం మీదా.. ముఖ్యంగా మోడీ బ్యాచ్ మీద అమితమైన ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తోంది. తాజాగా పన్నీరు మాష్టారు చెప్పిన మాటలు ఇందుకు నిదర్శనంగా చెప్పక తప్పదు. ప్రధాని మోడీని నరసింహావతారంగా పోల్చిన పన్నీరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ.. పాక్ తో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంతో పాటు.. మోడీ మీదా పలు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ నరసింహావతారం ఎత్తారని.. ఆయన ఒత్తిళ్లకు లొంగలేదన్నారు. నారసింహుడిలా విజృంభించారని.. పొరుగుదేశం చేస్తున్న ఉగ్రవాదాన్ని సమూలంగా ధ్వంసం చేసి ప్రపంచ దేశాలన్నింటి ప్రశంసలకు పాత్రుడయ్యారన్నారు.
ప్రధాని ధైర్యస్థుడని.. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించటానికి చర్యలు తీసుకుంటున్నారన్న పన్నీరు.. మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తలతో ముంచెత్తారు. ఎంత పొత్తు పెట్టుకుంటే మాత్రం.. తనకున్న ఇమేజ్ ను పక్కన పెట్టేసి మోడీ మాష్టారి మనసు దోచుకునేలా పొగిడిన పొగడ్తలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.