ప్రజెంట్ టెక్నాలజీ యుగంలో రోజుకో వినూత్న ఆవిష్కరణ జరుగుతున్నది. శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఇంకా మున్ముందుకు తీసుకెళ్లేందుకుగాను ప్రయత్నిస్తున్నారు. విభిన్న విషయాలపైన రీసెర్చ్ చేస్తున్నారు. అయితే, ఇంతటి ఆధునిక కాలంలో కొందరు ఇంకా మూఢనమ్మకాల్లోనే ఉన్నారు. కేవలం భారతదేశంలోనే మూఢనమ్మకాలున్నాయని మీరు భావిస్తే పొరపడినట్లే. విదేశాల్లోనూ ఈ భావాలున్నాయి. ఈ మూఢనమ్మకాలతో ముక్కుపచ్చలారని పిల్లల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి జరిగింది. వివరాల్లోకెళితే.. కాలిఫోర్నియాలోని సర్ఫింగ్ స్కూల్ ఓనర్ మాథ్యూ టేలర్ కోలమన్. వైఫ్, ఇద్దరు పిల్లలతో హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నాడు.
ఆధునికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న కాలిఫోర్నియాలో ఉంటున్న ఈయనలో మూఢనమ్మకాలు ప్రబలాయి. తన పిల్లల డీఎన్‌ఏలో పాముల డీఎన్ఏ ఉందని భావించిన కోల్‌మన్ వారిని హతమార్చాడు. ఈ స్నేక్ డీఎన్ఏ వల్ల పిల్లలు రాక్షసులుగా మారిపోతున్నారని భావించాడు. ఇలా వారిని హతమార్చేందుకుగాను కోల్‌మన్ ప్లాన్ చేసి మరీ వారిని తీసుకెళ్లాడు. ఈ నెల 7న కోల్‌మన్ తన పిల్లలను ట్రిప్ పేరిట బయటకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే తన భార్యను ఇంట్లోనే వదిలేశాడు. భార్య వద్దని వారించినా పట్టించుకోకుండా పిల్లల్ని మెక్సికోకు తీసుకెళ్లాడు. ఇక బయటకు వెళ్లాక కోల్‌మన్ భార్య ఆయనకు చాలా సార్లు ఫోన్ చేసింది. కానీ, అతడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ క్రమంలోనే భార్య అనుమానపడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నెట్‌వర్క్ లోకేషన్ ఆధారంగా అడ్రస్ ట్రాక్ చేశారు.
అతడి ఆచూకి కనుగొన్నారు. మెక్సికోలో పిల్లలు ఇద్దరిని గన్‌తో షూట్ చేసిన కోల్‌మన్ అక్కడే ఉన్నాడు. పిల్లలు రాక్షసులుగా మారుతారని తనకు అనిపించినందు వల్లే వారిని చంపినట్లు మాథ్యూటేలర్ కోల్‌మన్ తెలిపాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు అతడు. ఆధునిక టెక్నాలజీ యుగంలో అది విదేశంలో ఇలాంటి ఘటన జరిగిందని తెలుసుకుని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే భారతదేశంలో ఇలాంటి ఘటనలు బోలెడు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. విదేశంలో పిల్లలో పాము డీఎన్ఏ ఉందని మూఢనమ్మకం పెట్టుకుని పిల్లల ప్రాణాలు తీశాడు సదరు కిరాతక తండ్రి. కాగా, దేశంలో రకరకాలుగా నమ్మకాలు మూఢ నమ్మకాలకు లీడ్ చేస్తుంటాయి. మంత్రాల నెపంతో దేశంలో రోజుకో ఘటన జరుగుతూ ఉంటుంది. ఎవరో ఏదో చేశారనే భ్రమ పడుతూ మనుషులు మానసికంగా డిస్ట్రబ్ అవుతుంటారు. అయితే, శాస్త్రీయ దృక్పథం, పరిశీలనా స్ఫూర్తి లేకపోవడం వల్లే జనాల్లో ఇలాంటి మూఢనమ్మకాలు బాగా ప్రబలుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రజల్లో హేతువు ఉండాలని, ప్రశ్నించే స్ఫూర్తి నింపాలని తద్వారానే మూఢ నమ్మకాలకు స్వస్తి పలుకొచ్చిని అంటున్నారు నిపుణులు. కాలిఫోర్నియా వంటి ఆధునిక నగరంలో జనాలు ప్రతీ రోజు టెక్నాలజీని ఎంతో విరివిగా ఉపయోగిస్తుంటారు. అలాంటి దేశంలో కేవలం పాము డీఎన్ఏ ఉందనే మూఢనమ్మకం, సైన్స్‌ను పాతాళంలోకి తొక్కేసింది. ఫలితంగా ఎలాంటి కన్ఫర్మేషన్ చేసుకోకుండానే ఓ కసాయి తండ్రి ఇద్దరు పిల్లల నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఇలాంటి ఘటనలను చూసి ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలని, సైన్స్ పట్ల నమ్మకం పెంచుకుని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.