కరోనా వేళల్లో చరిత్రలో గుర్తుండిపోయేలా పార్లమెంట్ సమావేశాలు .. ప్రత్యేకతలేంటంటే. ?

Update: 2020-08-17 09:50 GMT
కరోనా మహమ్మారి దేశంలో రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 26 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. 50వేల మందికి పైగా కరోనాతో చనిపోయారు. ఎంతటి విషాదం ఇది. గత 24 గంటల్లో కొత్తగా 57981 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2647663కి చేరింది. అలాగే... నిన్న ఒక్క రోజే 941 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 50921కి చేరింది. ఇక ఈ కరోనా దెబ్బ కి దేశంలో అనేక సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా నిరుద్యోగం భారీగా పెరిగిపోతుంది.  అలాగే  చైనాతో సరిహద్దు వివాదంలో హిసాత్మక ఘటనలు కలకలం రేపుతున్నాయి. వీటితో పాటుగా మరిన్ని సమస్యలపై చర్చలు జరపడానికి ..అతి త్వరలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించబోతుంది. రాజ్యాంగం ప్రకారం ..  ఆరు నెలల్లో ఒక్కసారైనా సమావేశాలు జరిగితీరాల్సిందే. దీనితో వర్షాకాల సమావేశాలకు పార్లమెంట్ ముస్తాబు అవుతుంది.

పార్లమెంటు చరిత్ర లోనే తొలి సారి  చాలా భిన్నం గా, వినూత్న ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్ సభ, రాజ్యసభల్లో సీటింగ్ స్వరూపం పూర్తిగా మారిపోనున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్ నియమాలతో పాటు ఉభయ సభలూ వైరస్ లేదా ఇతర సూక్ష్మ జీవుల బారిన పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా అన్ని పనులు పూర్తి చేసుకొని ..ఆగస్టు చివరి వారంలో కానీ , సెప్టెంబర్ లో కానీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఒకేసారి అటు లోక్ సభ.. రాజ్యసభ సమావేశాలు జరుగుతుంటాయి. అందుకు భిన్నంగా ఈసారి మాత్రం ఒక రోజు లోక్ సభ, మరో రోజు రాజ్యసభ సభ నిర్వహించనున్నారు. అంతేకాదు.. లోక్ సభ జరిగే సమయంలో ఆ ఎంపీల్ని రాజ్యసభ లోనూ కూర్చోబెట్టనున్నారు. అదే సమయంలో రాజ్యసభను నిర్వహించే సమయం లో అక్కడి సభ్యుల్ని లోక్ సభలో కూర్చోబెట్టాలన్న ఆలోచన లో ఉన్నారు.

అప్పుడు మాత్రమే భౌతిక దూరాన్నిపాటించేలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే గ్యాలరీల లో కూడా ఎంపీలు కుర్చిప్బోతున్నారు. దీని తో మాజీలని , వీక్షకులకు ఈసారి అనుమతి ఉండదు. అలాగే రెండు సభల్లో కూర్చుంటే ఎలా సభ జరగాలి అని అంటే .. దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అందరికి కనిపించేలా ఒక్కో సభలో 85 అంగుళాల నాలుగు తెరల్ని.. గ్యాలరీల్లో 40 అంగుళాల ఆరు స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. గ్యాలరీలో కూర్చున్న సభ్యలు సభా కార్యకలాపాల్లో పాలు పంచుకునేలా ప్రతి సీటుకూ మైక్ తోపాటు.. స్విచ్ లను ఏర్పాటు చేస్తున్నారు. స్పీకర్ చైర్ నుంచి దూరంగా కూర్చున్నప్పటికీ సభ్యులు మాట్లాడేందుకు, సభను వీక్షించేందుకు వీలుగా ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ ని, ఆడియో కన్సోల్స్  ను ఏర్పాటుచేశారు.

 కరోనా వేళ సోషల్ డిస్టెన్స్ తో పాటు గాలి లోని ఇతర సూక్ష్మ జీవులను నిర్వీర్యం చేయ గలిగే అల్ట్రావయొలెట్ జెర్మిసైడల్ ఇర్రేడియేషన్ పరికరాలను ఉభయ సభల్లో అమర్చుతున్నారు. లోక్‌సభ, రాజ్య సభ చాంబర్లు, గ్యాలరీల్లో.. రేడియేషన్ పద్ధతి ద్వారా ఆల్ట్రా వైలెట్ కిరణాలను ప్రసరింపచేసి వైరస్‌ను హతమార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ  వర్షాకాల సమావేశాలు నిర్వహించాల్సిన విషయం పై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా  ఈ రోజు జరిగే కీలక భేటీలో  దీనిపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.
Tags:    

Similar News