ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వాయు ప్రతాపానికి గురయ్యారు. తీవ్రమైన గాలుల ధాటికి విమానంలోని ప్రయాణికులు ఎగిరి పడ్డారంటే ఎంత స్పీడుతో వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటన హవాయిలో జరిగింది. ఈ సంఘటనపై ఎయిర్ లైన్స్ సిబ్బంది మాట్లాడుతూ గతంలో ఇలాంటి ఘటనలు తామెప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. హవాయి ఎయిర్ లైన్స్ విమానం ఫీనిక్స్ నుంచి హోనొలులుకు బయలు దేరింది. ఈ విమానంలో పది మంది క్రూ మెంబర్స్.. 278 మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తున్నారు. విమానం కాసేపట్లో ల్యాండ్ కానుండటంతో ప్రయణీకులంతా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు సిద్దమవుతున్నారు.
ఈ క్రమంలోనే ఉన్నట్టుండి బలమైన ఈదురుగాలులు విమానం పైకప్పును తాకాయి. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులంతా ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. విమానం ఎత్తు రెండుసార్లు ఆకస్మాత్తుగా తగ్గిపోవడంతో ప్రయాణికులు సీట్ల నుంచి గాల్లోకి ఎగిరినట్లు పలువురు వాపోయారు. విమానం కుదుపులకు గురవడంతో అత్యవసర ల్యాండింగ్ కు ఎయిర్ లైన్స్ అనుమతి ఇచ్చింది.
విమానం ల్యాండ్ అయిన వెంటనే హొనొలులు ఎమర్జెన్సీ టీం రంగంలోకి దిగి గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఈ సంఘటనపై ఎయిర్ లైన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జోన్ స్నూక్ స్పందించారు. ఇలాంటి సంఘటనలు తానెప్పుడూ చూడలేదని తెలిపారు. ఈ ప్రమాదంలో చాలామంది ప్యాసింజర్లు విమానం పైకప్పును ఢికొట్టారని తెలిపారు.
ప్రయాణికులు సీటు బెల్ట్ పెట్టుకోక పోతే తీవ్రంగా గాయపడే వారని తెలిపారు. అయినప్పటికీ ఈ ప్రమాదంలో 20 మంది గాయాల పాలైయ్యారని తెలిపారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. కాగా ఒక వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు చెప్పారు. కొందరి తలలకు గాయాలు కాగా.. మరికొందరు వీపరీతమైన గాలుల కారణంగా వికారం.. వాంతులకు లోనయ్యారని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.