బ్యాంకుల నుంచి వేలకోట్లను రుణాలుగా తీసుకొని వాటిని చెల్లించడంలో విఫలమై.. చర్యలు చేపట్టడానికి బ్యాంకులు సిద్ధమయ్యే లోపే విదేశాలకు పారిపోతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో తరచూ చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ.50కోట్ల పైన రుణాలు తీసుకునే వారి పాస్ పోర్ట్ వివరాలు ఇకపై తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. తాజాగా ఇదే విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ రాజీవ్ కుమార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటి నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ.50కోట్ల పైన రుణాలు తీసుకోవాలనుకున్న వారు రుణం పొందే సమయంలో పాస్ పోర్టు వివరాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. లోన్ అప్లికేషన్ ఫామ్స్ లో మార్పులు చేశారు. ఇప్పటికే 50కోట్లపైన రుణాలు తీసుకున్న వారి పాస్ పోర్టు వివరాలను 45 రోజుల్లోగా సేకరించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. బ్యాంకులు సకాలంలో చర్యలు తీసుకోవడానికి - ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా సంబంధిత అధికార వర్గాలను అప్రమత్తం చేయడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రుణాలు తీసుకోవాలనుకున్న వారికి ఒకవేళ పాస్ పోర్టు లేని పక్షంలో తమకు పాస్ పోర్టు లేదని డిక్లరేషన్ ఫామ్ ను ఇవ్వాల్సి ఉంటుంది.
ఇదిలాఉండగా...బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు మరింత పెరిగాయి. డిసెంబర్ 31తో ముగిసేనాటికి ప్రభుత్వ - ప్రైవేట్ రంగ బ్యాంకుల మొండి బకాయిలు రూ.8.41 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ముఖ్యంగా పారిశ్రామికం - సేవలు - వ్యవసాయ రంగం లో వీటి వాటా మరి ఎక్కువగా ఉన్నదని పేర్కొంది. వీటిలో ఇండస్ట్రీకి ఇచ్చిన రుణాల్లో రూ.6,09,222 కోట్లు ఎన్ పీఏలుగా మారయన్న కేంద్రం.. మొత్తం ఎన్ పీఏల్లో వీటి వాటా 20.41 శాతంగా ఉంది. అలాగే సేవల రంగం రూ.1,10,520 కోట్లు(5.77 శాతం) - వ్యవసాయం రూ.69,600 కోట్లు(6.53 శాతం) - ఆహారేతర రంగం రూ.14,986 కోట్లు - రిటైల్ లోన్ల వాటా రూ.36,630 కోట్లు(2.01 శాతం) గా ఉన్నాయని లోక్ సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ తో ముగిసిన తొమ్మిది నెలలకాలంలో ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టే వారి సంఖ్య 1.66 శాతం పెరిగి 9,063కి చేరుకున్నట్లు శుక్లా వెల్లడించారు. వీటి విలువ రూ.1,10,050 కోట్లని ఆయన చెప్పారు. ఈ రుణాలు ఎగ్గొట్టేవారిపై ఉక్కుపాదం మోపడానికి ఇప్పటికే కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నదని, 2,108 మందిపై ఎఫ్ ఐఆర్ దాఖలు చేసినట్లు తెలిపారు.
బ్యాంకులకు చెల్లించాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన ప్రైవేట్ - కార్పొరేట్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్ బీయూ) కన్వీనర్ వీవీఎస్ ఆర్ శర్మ కోరారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేద - మధ్యతరగతి ప్రజలు ఇంటి కోసం రుణాలు తీసుకుంటే ముక్కు పిండి వసూలు చేస్తారని - బడా కంపెనీల వద్ద బ్యాంకులకు సంబంధించిన నిరర్థక ఆస్తులు రూ.10 లక్షల కోట్లుగా ఉన్నాయని - ముందుగా వీటిని వసూలు చేసి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని - అందుకోసం కఠినమైన చట్టాలను రూపొందించాలన్నారు.
పీఎన్‌బీలో జరిగిన మోసాన్ని సాకుగా చూపుతూ ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలన్నారు. ప్రైవేట్ బ్యాంకులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెబుతున్న వారు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు ఎందుకు మూతపడిందో సమాధానం చెప్పాలన్నారు. కొన్ని కార్పొరేట్ శక్తులు ప్రభుత్వ బ్యాంకులను దివాలా చేయించే కుట్ర చేస్తున్నాయని - పాలక ప్రభుత్వాలు ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఈ నెల 21న ప్రభుత్వ రంగ బ్యాంకులను రక్షించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నామని - లక్షలాది సంతకాలను సేకరించి లోక్ సభ స్పీకర్‌కు నివేధిస్తామని ఆయన తెలిపారు.