ఏపీలో రాజకీయం ఎంతలా వేడెక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో ఏడాదిన్నర పాటు సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉన్నా.. మరో నెలలోనో.. రెండు నెలల్లోనో ఎన్నికలు వచ్చేస్తున్నాయన్నట్లుగా అక్కడి పరిస్థితి ఉంది. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో కీలక భూమిక పోషించటంతో పాటు.. అధికారం ఎవరి చేతిలో ఉంటుందన్న దానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీ రోల్ ఫోషించనున్నారన్న చర్చ జరుగుతోంది.
ఈ కారణంతోనే అధికార వైసీపీకి పవన్ కల్యాణ్ ఇప్పుడో లక్ష్యంగా మారినట్లుగా చెప్పొచ్చు. ఆయన్ను దెబ్బ తీసేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకూడదన్నట్లుగా అధికార వైసీపీ వ్యవహరిస్తుందని చెబుతున్నారు. వైసీపీ వారు మొదలు పెట్టిన ప్రచారానికి జనసేన అధినేత కానీ.. ఆయన పార్టీ వారు కానీ సరైన రీతిలో రియాక్టు కావట్లేదన్న విమర్శ ఉంది. అయితే.. ఇటీవల కాలంలో జనసేనాని తన తీరును మార్చుకోవటం.. వైసీపీ నేతల్ని ఉద్దేశించి ఆయన చేస్తున్న ఘాటు విమర్శలు రాజకీయాల్ని వేడెక్కించేలా మార్చాయి.
ఆ మధ్యన పార్టీ వారితో మాట్లాడే సందర్భంగా.. చెప్పు చూపించి.. చెప్పుతో కొడతానంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో తెలిసిందే. అయితే.. పవన్ అండ్ కో చేసే మాటాల దాడి కంటే వైసీపీ బ్యాచ్ వి మరింత తీవ్రంగా ఉండటం కనిపిస్తుంది. ఆ లోటును తీర్చేందుకు పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది.
ఎప్పుడూ లేని రీతిలో.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక కీలక అంశాన్ని బయటకు తీయటమే దాన్ని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు పవర్ ఫుల్ పంచ్ లుగా మారాయని చెబుతున్నారు. తాము టార్గెట్ చేసిన వారికి చుక్కలు కనిపించే పాయింట్లతో ఫైర్ అయ్యే వైసీపీ వారు సైతం నోరు మెదప లేని రీతిలో పవన్ తాజా పంచ్ ఉందంటున్నారు. సీఎం జగన్ గురించి తెలిసిన వారు.. ఆయన స్టైల్ గురించి తెలిసిన వారంతా పవన్ చేసిన తాజా వ్యాఖ్యతో ఆత్మరక్షణలో పడిన పరిస్థితి.
ఇంతకూ ఆయన విసిరిన పంచ్.. జగన్ నవ్వు మీద. సమయం సందర్భం లేకుండా ఎప్పుడైనా సరే జగన్ నవ్వుతారని.. ఆయన మైండ్ సెట్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు.. ఆ సందర్భంగా ప్రదర్శించిన హవభావాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాగా మాట్లాడిన సందర్భంలో జగన్ నవ్వుపై పవన్ పంచ్ లు చూస్తే.. నవ్వులకు లోటు ఉండదని సమయం సందర్భం లేకుండా నవ్వేయటం సీఎం జగన్ లో కనిపిస్తుందంటూ.. "సమయం సందర్భంగా లేకుండా నవ్వులకు లోటు ఉండదు. నవ్వు నాలుగు విధాల చేటు అన్న సామెత ఆయనకు తెలీదు. ఏడుస్తున్నప్పుడు.. అలా అంటారా.. బాగున్నారా.. ఆ... చచ్చిపోయారా? ఊ.. ఏంటి ఆస్తులు పోయాయి? ఏంటి పది కోట్లు పోయాయా(జగన్ ను ఇమిటేట్ చేస్తూ).. ఊ.. ఊ (నవ్వును ప్రదర్శిస్తూ) గడపలు కూల్చేశారా? ఊ.. ఊ... (ఒకలాంటి నవ్వును ప్రదర్శిస్తూ) అలా అనకూడదండి. అది తప్పు" అంటూ విసిరిన విసుర్లు సీఎం జగన్ కు సూటిగా తగులుతున్నాయని చెప్పొచ్చు.
ఇప్పటివరకు జగన్ పై ఎక్కు పెట్టిన అస్త్రాల్లో ఆయన నవ్వును తిరుగులేని రీతిలో పంచ్ విసిరిన తీరుకు సరైన సమాధానం ఎలా చెప్పాలన్న దానిపై వైసీపీ థింక్ ట్యాంక్ నుంచి ఎలాంటి బదులు రాలేదు. ఎప్పుడైనా.. ఎక్కడైనా పవన్ ఏదైనా పవర్ ఫుల్ మాట అన్నా.. ఘాటు వ్యాఖ్య చేసినంతనే దానికి కౌంటర్ గా ఇచ్చే దానికి భిన్నంగా తొలిసారి పవన్ అంత మాట అన్న తర్వాత కూడా వైసీపీ థింక్ ట్యాంక్ మరెలాంటి కౌంటర్ ఇవ్వలేకపోయిన తీరు చూస్తే.. జగన్ బ్యాచ్ కు పవన్ భారీ పంచ్ ఇచ్చారన్న మాట వినిపిస్తోంది. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.