సూచనా.. వార్నింగా పవన్..?

Update: 2015-08-14 04:15 GMT
ఛానల్ గొట్టాలతో మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడని జనసేన అధినేత.. తనకు నచ్చినప్పుడు.. తీరిగ్గా ఉన్నప్పుడో.. కానీ ట్విట్టర్ సాయంతో స్పందించటం ఈ మధ్య అలవాటుగా మారిందిగా. తాజాగా మరోసారి పవన్ కల్యాణ్ ట్విట్టర్ ను వేదికగా తీసుకొని రెండు ట్వీట్టు చేశారు.

థాజాగా ఆయన చేసిన ట్వీట్టు ఏపీ సర్కారుకు కొద్దిపాటి సూచనగా.. మరికాస్త వార్నింగ్ గా ఉండటం గమనార్హం. ఏపీ రాజధాని కోసం సేకరించాల్సిన భూమికి సంబంధించి.. భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని ఏపీ అధికారపక్షం భావిస్తున్న సమయంలోనే పవన్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేయటం గమనార్హం.

రాజధాని భూసేకరణ వ్యవహారం సామరస్య వాతావరణంలో పరిష్కరించి.. ముందుకు వెళతారని ఆశిస్తున్నా అంటూ పవన్ వ్యాఖ్య చేశారు. రాజధాని అమరావతి కోసం సేకరించాల్సిన భూమికి సంబంధించి ఒక స్పష్టమైన సందేశాన్ని ఏపీ సర్కారుకు ఇచ్చినట్లు చెప్పాలి. ఎందుకంటే.. రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములు ఇచ్చేయగా.. మరికొందరు ఇవ్వాల్సి ఉంటుంది.

కొందరు రైతులు భూములు ఇచ్చేయటం ఏ మాత్రం ఇష్టపడటం లేదు. అలా ఇవ్వటానికి ఇష్టపడని వారిపై భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని టీడీపీ సర్కారు భావిస్తోంది. అయితే.. రాజధాని భూముల కోసం భూసేకరణ చట్టాన్ని వినియోగించవద్దని పవన్ సూచన చేశారు. భూసేకరణ చట్టాన్ని అమలు చేయకూడదని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తాజాగా ట్వీట్ చేశారు. మరి.. పవన్ మాటల్ని ఏపీ సర్కారు  ఏ విధంగా తీసుకుంటుంది? ఇప్పుటి పరిస్థితిలో ఏపీ సర్కారు ఏం చేస్తుంది? భూసేకరణను ఆపేసి పవన్ చెప్పినట్లు చేస్తారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు కాలమే ఇవ్వాల్సి ఉంటుంది.
Tags:    

Similar News