నిర్భయ నిందితులను ఎవరు ఎక్కడ ఉరితీస్తారు?

Update: 2019-12-25 12:04 GMT
నిర్భయ నిందితులకు అంతిమగడియలు దగ్గరపడ్డాయి. క్షమాభిక్షలు, రివ్యూ పిటీషన్లు అన్నీ అయిపోతున్నాయి. కొత్త సంవత్సరం మొదటి వారంలోనేవారికి ఉరి పడడం ఖాయంగా కనిపిస్తోంది.

నిర్భయ తల్లిదండ్రులు ఈ నలుగురు నిందితులకు ఎప్పుడు ఉరిపడుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

నిర్భయ నిందితులకు ఉరిశిక్ష పడింది.అయితే రివ్యూ పిటీషన్లతో కొంచెం కాలయాపన సాగుతోంది. మరి వీరిని ఎవరు ఉరితీస్తారు? ఎక్కడ తీస్తారనేది ఆసక్తిగా మారింది..

తాజాగా నిర్భయ కేసులో నలుగురు దోషులకు వారు ఉంటున్న తీహార్ జైలు లోనే మూడో నంబర్ జైలు గదిలో ఉరితీయాలని అధికారులు నిర్ణయించారు. ఉరితీసే గదిని ఎంపిక చేశారు. మూడో నంబర్ గదిలోనే నిర్భయ నిందితుల ఊపిరి ఆగిపోనుంది. ప్రస్తుతం ఆ గదిని 24గంటల పాటు జైలు గార్డులు కాపాలా కాస్తున్నారట.. హైసెక్యూరిటీ కల్పించారు. ఎవరినీ అనుమతించడం లేదట..  ఉరి తీసిన తలారికి చివరి నిమిషం దాకా ఎవరిని ఉరితీస్తున్నారో చెప్పరు. టెర్రరిస్టునే ఉరితీయాలని చెబుతారట.. ఉరికంబం వద్ద మాత్రమే తలారీకి అసలు నిజం చెప్తారట..

ఇక ఉరికంబానికి వేలాడదీసేవి బక్సర్ ఉరితాళ్లు.. గాడ్సే నుంచి మొన్నటి యాకుబ్ మెమెన్ వరకూ అందరి ఉరికి ఈ బక్సర్ ఉరితాళ్లనే వాడారు. ఈ తాడు చాలా మృదువుగా ఉంటుంది. మృదువైన నూలును దీని తయారీకి వాడుతారు. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగారమైన తీహార్ జైలులోనే నలుగురు నిర్భయ నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేశారు అధికారులు..
    

Tags:    

Similar News