పవన్ ను చూసిన వెంటనే అభిమానం కట్టలు తెగుతుంది. కొంతమంది సీఎం.. సీఎం అంటే..మరికొందరు ఆయన్ను చూసేందుకు ముందుకు తోసుకురావటం.. ఏ మాత్రం క్రమశిక్షణ లేకుండా వ్యవహరించటం ఇప్పటి దృశ్యం కాదు.. ఎన్నో ఏళ్లుగా చూస్తున్నదే. ఫ్యాన్స్ హడావుడి.. తనను చూసేందుకు..తన మాట వినేందుకు ప్రదర్శించే తాపత్రయాన్ని చూసినంతనే పవన్ ముఖంలో బిడియం.. మొహమాటం.. వారి అభిమానాన్ని తానెలా తీర్చుకోవాలనన ఆరాటం.. మొత్తంగా కలిపి సున్నితంగా ఫ్యాన్స్ ను ఇలా ఉండండి.. అలా ఉండండని నాలుగుసార్లు చెప్పి ఊరుకోవటం చేస్తుంటారు.
పవన్ మార్క్ లా చెప్పుకునే బిడియం.. మొహమాటం తాజా ఉదంతంలో మిస్ కావటమే కాదు.. ఎక్కడ లేని చిరాకు.. అసహనం.. ఇష్టం లేని పనిని బలవంతంగా చేయిస్తే ఎలా ఉంటుందో.. సరిగ్గా అలానే వ్యవహరించారు పవన్. హైదరాబాద్ లోని సంధ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మెగా అభిమానుల (ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే చిరంజీవి ఫ్యాన్స్) ఆత్మీయ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు.
ఎప్పటిలానే పవన్ ను వేదిక మీద చూసినంతనే చెలరేగిపోవటం.. క్రమశిక్షణ లేకుండా ముందుకు తోసుకొచ్చే ప్రయత్నం చేయటం.. వారిని అదుపు చేయటం పోలీసులకు ఇబ్బందికరంగా మారటం లాంటివి జరిగిపోయాయి. ఇంకో వైపు సీఎం అంటూ పవన్ ను ఉద్దేశించి నినాదాలు చేయటం.. మరోవైపు చిరంజీవి జిందాబాద్ అంటూ స్లోగన్స్ ఇవ్వటం లాంటివి కనిపించింది. నిజానికి ఇలాంటివేమీ పవన్ కు కొత్త కాదు. గడిచిన కొన్నేళ్లుగా ఇలాంటి సీన్లు ఆయన చూస్తూనే ఉన్నారు.
కానీ.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఆయన చిరాగ్గా ఉండటం.. ఆగ్రహాన్ని ప్రదర్శించటం మాత్రం ఆశ్చర్యకరంగా మారింది. నిలువెత్తు మానవత్వం.. అంతకు రెట్టింపు మొహమాటం.. కాస్తంత సిగ్గరిగా తనను తాను ప్రజంట్ చేసుకునే పవన్.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కరకుగా.. కఠినంగా.. కుండ బద్ధలు కొట్టినట్లుగా మండిపడటం.. గట్టిగా చెప్పటం.. ఆవేశంతో అభిమానులకు క్లాస్ పీకటం లాంటి కొత్త సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.
తరచూ తన ఫ్యాన్స్ అత్యుత్సాహం తనను ఇబ్బంది పెట్టటం.. సోషల్ మీడియాలో వారు వ్యవహరించే తీరుకు పవన్ ను వేలెత్తి చూపించటం లాంటివి తమ్ముడ్ని ఇరిటేట్ చేస్తున్నాయేమో. ఇక.. ఇప్పటివరకూ పవన్ ఫ్యాన్స్ కాస్తా..ఇకపై చిరు ఫ్యాన్స్ పార్టీలో చేరటం.. తన సభలో అన్న చిరు పేరుతో జిందాబాద్ లు పలకటం ఆయన్ను ఇరిటేట్ చేసిందా? అన్నది క్వశ్చన్ గా మారింది.
గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఫ్యాన్స్ ను సర్ది చెప్పేక్రమంలో కూర్చో.. కూర్చో.. అంటూ నాలుగుసార్లు చెప్పిన పవన్ సహనం కోల్పోయి.. కూర్చో అంటూ గద్దించటం.. అతి చేయొద్దన్న మాటను మాట్లాడటం .. ఉత్సాహం ఉండాలే కానీ అత్యుత్సాహం పనికి రాదంటూ క్లాస్ పీకటం లాంటివి చూసినోళ్లంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి. పవన్ లో ఈ తరహా యాంగిల్ ఎప్పుడూ ప్రదర్శించని ఆయన.. ఈసారి అలా వ్యవహరించటం హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ హడావుడి పాతదే అయినా.. పవన్ ఆగ్రహం మాత్రం కొత్తగా ఉందని చెప్పక తప్పదు. మొహమాటం.. సిగ్గుపడటం లాంటివి పవన్ నుంచి పోతే మంచిదే. అదే సమయంలో ఈ కోపం.. అసహనం.. కేకలు వేయటం ఏ మాత్రం మంచిది కాదన్నది పవన్ గుర్తించాల్సిన అవసరం ఉంది.