మిర్చి రైతుల కోసం పవన్ లేఖ

Update: 2017-05-02 14:07 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రమంగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ మధ్య ప్రతి అంశం మీదా.. సమస్యల మీదా సత్వరమే స్పందిస్తున్న పవన్ కళ్యాణ్.. తాజాగా మిర్చి రైతుల ఇబ్బందులపై స్పందించాడు. మిర్చి రైతుకు క్వింటాలుకు రూ.11 వేలు గిట్టుబాటు ధరను చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఓ లేఖ రాశాడు. లేఖ ప్రతిని ఆయన మీడియాకు విడుదల చేశాడు. మిర్చి రైతుల కష్టాలకు ప్రభుత్వాలే కారణమని పవన్ అభిప్రాయపడ్డాడు. ఐతే పవన్ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ లేఖ రాశాడో పేర్కొనలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మిర్చి రైతులు కష్టాలు పడుతున్న నేపథ్యంలో రెండు ప్రభుత్వాలనూ ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది. మామూలుగా పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే టార్గెట్ చేసుకుంటాడన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ లేఖలో అనేక కీలకాంశాల్ని పవన్ ప్రస్తావించాడు. మిర్చి మార్కెట్ ధరకు.. గిట్టుబాటు ధరకు చాలా వ్యత్యాసం ఉందన్నాడు. మిర్చి క్వింటాలుకు కనీసం రూ.11 వేలు చెల్లిస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రభుత్వం గిట్టుబాటు ధర విషయంలో పట్టించుకోకపోవడంతో రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారన్నాడు. ఎంత విస్తీర్ణంలో రైతులు మిర్చి సాగు చేశారనే విషయాల్ని చెప్పడంలో వ్యవసాయ శాఖ వైపల్యం చెందిందని.. విదేశీ కార్పోరేట్ కంపెనీలపై ఉన్న శ్రద్ద రైతులపై పాలకులకు లేదని పవన్ విమర్శించాడు. రైతు కన్నీరు పెట్టడం దేశానికి మంచిది కాదని.. ఇప్పటికైనా మేల్కొని రైతుకు న్యాయం చేయాలని పనవ్ కోరాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News