పీకే... లోకేశ్ ను మ‌రిపిస్తున్నారే!

Update: 2019-03-06 06:30 GMT
రాజ‌కీయాల్లోకి క‌నీస అవ‌గాహ‌న కూడా లేకుండా వ‌చ్చేస్తున్న కొంద‌రు నేత‌లు... త‌మ అజ్ఞానంతో జ‌నాన్ని అయోమ‌యానికి గురి చేయ‌డంతో పాటు వారికి కామెడీని పంచేస్తున్నారు. ఈ కోవ‌లో ఇప్ప‌టిటే టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఏపీ కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ త‌న‌దైన శైలి అజ్ఞానాన్ని చాటుకున్నారు. అంబేద్క‌ర్ వ‌ర్ధంతిని జ‌యంతిగా అభివ‌ర్ణించేసిన లోకేశ్... తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న టీడీపీపై త‌న‌దైన శైలి స్వీయ సెటైర్లు వేసుకుని జ‌నంలో న‌వ్వుల‌పాల‌య్యారు. పప్పుగా - గ‌న్నేరు ప‌ప్పుగా ప్ర‌త్య‌ర్థుల‌తో పిలిపించుకున్న లోకేశ్... ఇప్పడిప్పుడే కాస్తంత దారిలో ప‌డుతున్నార‌న్న భావ‌న క‌లుగుతోంది. మ‌రి జ‌నానికి లోకేశ్ త‌ర‌హా కామెడీ ఉండ‌దా? అంటే... లోకేశ్ జ్ఞానం పెంచుకుని ఈ త‌ర‌హా న‌వ్వుల పాలు నుంచి త‌ప్పించుకున్నా... ఆయ‌న స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు రంగంలోకి దిగిపోయారు.

సినీ న‌టుడిగా అశేష అభిమాన ధ‌నాన్ని సంపాదించుకున్న ప‌వ‌న్‌.. ఆ అభిమానుల‌తోనే ఏదో సాధించేద్దామ‌ని రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పార్ట్ టైం పొలిటీషియ‌న్ అని ఇప్ప‌టికే చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ప‌వ‌న్‌.. ఆవేశంగా ప్ర‌సంగించ‌డంలో మాత్రం త‌న‌కు ఎవ‌రూ సాటి రార‌ని నిరూపించేశారు. ప్ర‌సంగించేట‌ప్పుడు ఎగ‌ర‌డం - గెంత‌డం - పిడికిళ్లు బిగించి అదో ర‌క‌మైన ఎక్స్‌ ప్రెష‌న్‌ తో జ‌నాన్ని అల‌రించ‌డంలో ప‌వ‌న్‌ కు సాటి రాగ‌ల నేత‌లు దాదాపుగా ఇప్ప‌టిదాకా ఎవ‌రూ లేర‌నే చెప్పాలి. తాజాగా నిన్న నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న నోటి నుంచి ఓ అద్భుత‌మైన ప‌ద‌బందం దొర్లింది. ఈ ప‌దాన్ని వింటే... దేశ‌ - రాష్ట్ర రాజ‌కీయాల‌పై ప‌వ‌న్‌ కు ఎంత అవ‌గాహ‌న ఉందో ఇట్టే అర్ధం కాక మాన‌దు.

అయినా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే.... త‌న‌దైన శైలిలో మాట్టాడుతూ సాగిన ప‌వ‌న్‌... జిల్లాకు చెందిన మంత్రి - టీడీపీ సీనియ‌ర్ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డిని ఏకంగా ముఖ్య‌మంత్రిగా అభివ‌ర్ణించేశారు. అది కూడా రాష్ట్రానికి కాద‌ట‌... ఒక్క నెల్లూరు జిల్లాకు మాత్ర‌మే చెందిన సీఎంగా సోమిరెడ్డిని అభివ‌ర్ణించారు. టంగ్ స్లిప్ మాట‌గానే అనిపిస్తున్నా... క‌నీసం ఈ ప‌దం దొర్లిన త‌ర్వాత కూడా ప‌వ‌న్ త‌న మాట‌ను స‌రిచేసుకొనే య‌త్నం చేయ‌క‌పోగా... త‌న స్పీచ్‌ లో ఎలాంటి త‌ప్పు దొర్ల‌న‌ట్టుగానే సాగిపోయారు. మొత్తంగా టంగ్ స్టిప్‌ లో లోకేశ్ త‌న‌కేమీ సాటి రార‌ని ప‌వ‌న్ చెప్ప‌కనే చెప్పేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. ప‌వ‌న్ టంగ్ స్లిప్‌కు సంబంధించి వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.


Full View


Tags:    

Similar News