ప‌వ‌న్ ఎఫెక్ట్..ఆ చానెళ్ల టీఆర్పీలు తగ్గుతాయా?

Update: 2018-04-25 08:17 GMT
గ‌త 6 నెల‌లుగా త‌న‌ను కొన్ని మీడియా చానెళ్లు ప‌నిగట్టుకొని విమ‌ర్శిస్తున్నాయ‌ని....వాటిపై సుదీర్ఘ న్యాయ‌పోరాటం చేయ‌బోతున్నాన‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌క‌టించిన విధంగానే ఏబీఎన్ - టీవీ9 - టీవీ5ల‌పై ట్విట్ట‌ర్లో ప‌వ‌న్ ఓ మినీ యుద్ధ‌మే చేస్తున్నారు. ఆ చానెళ్ల‌పై - వాటి అధిప‌తులు - సీఈవోల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతూ ప్ర‌తిరోజు వ‌రుస ట్వీట్ల‌తో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా, ఆ మూడు చానెళ్ల‌ను బాయ్ కాట్ చేయాల‌ని కూడా త‌న అభిమానుల‌కు ప‌వ‌న్ పిలుపునిచ్చారు. త‌మ త‌ల్లుల‌ను - చెల్లెళ్ల‌ను కించ‌ప‌రిచే కార్య‌క్ర‌మాలు ప్రసారం చేసే ఆ చానెళ్ల‌ను చూడ‌వద్దంటూ అభిమానుల‌నుద్దేశించి ట్వీట్ చేశారు. అయితే, ప‌వ‌న్ పిల‌పును అభిమానులు అందుకున్నారా....ప‌వ‌న్ పిలుపు ప్ర‌భావం ఆ చానెళ్ల‌పై ప‌డిందా లేదా అన్నాది ప్ర‌శ్నార్థకం. అయితే, మ‌రో 24 గంట‌ల్లో ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికే అవ‌కాశ‌ముంది.

వారానికోసారి టెలివిజ‌న్ చానెళ్ల టీఆర్పీ రేటింగుల‌ను బ్రాడ్ కాస్ట్ ఆడియ‌న్స్ రీసెర్చ్ కౌన్సిల్(BARC) ప్ర‌క‌టిస్తుంది. య‌థా ప్ర‌కారం రేపు గురువారం నాడు గ‌త వారానికి సంబంధించిన టీఆర్పీ రేటింగులు వెలువ‌డ‌నున్నాయి. దీంతో ప‌వ‌న్ పిలుపు ప్ర‌కారం .... ఆ చానెళ్లను వీక్షించేవారి సంఖ్య త‌గ్గిందా? లేదా? అన్న‌ది తేలిపోనుంది. ప‌వ‌న్ అభిమానులు ఆ చానెళ్లను బాయ్ కాట్ చేస్తే....వాటి టీఆర్పీలు ఒక్క‌సారిగా ప‌డిపోతాయా అన్న విష‌యం పై కూడా స్ప‌ష్ట‌త రానుంది. దీంతో, రేపు వెలువ‌డ‌బోతోన్న టీఆర్పీ రేటింగుల కోసం ఆ చానెళ్ల యాజ‌మాన్యాల‌తోపాటు ప‌వ‌న్ అభిమానులు కూడా ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తుంటార‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. మ‌రి...ఆ చానెళ్ల టీఆర్పీ రేటింగుల‌పై ప‌వ‌న్ ఎఫెక్ట్ ఎంత‌వ‌ర‌కు ఉంటుందో తెలుసుకోవాలంటే మ‌రో 24 గంట‌లు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News