పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పేమాటలకు చేసే చేష్టలకు ఏమాత్రం సంబంధం ఉండదు. అసలు ఒక్కోసారి ఏం చెప్తోడో - ఏం మాట్లాడుతున్నాడో కూడా ఎవ్వరికీ అర్థం కాదు.ఎక్కడో మొదలు పెడతాడు. మధ్యలో ఇంకెక్కడికో వెళ్తాడు. ఫైనల్ గా ఎక్కడో ముగిస్తాడు. మొదటినుంచి పవన్ తీరే అంత. ఇక విలాసాలు - పార్టీ - పార్టీ తాలూకూ ఖర్చు గురించి ప్రస్తావన వచ్చిన ప్రతీసారి.. పవన్ తన దగ్గర డబ్బులు లేవంటాడు. తమది చాలా పేద పార్టీ అని చెప్తుంటాడు. సీన్ కట్ చేస్తే.. హెలికాప్టర్ లో నియోజకవర్గాల్ని చుట్టేస్తున్నాడు పవన్.
గాజువాకలో నామినేషన్ వేసేందుకు పవన్ విజయవాడ నుంచి విశాఖ ఫ్లైట్ లో వచ్చాడు. అక్కడ నామినేషన్ విసిన తర్వాత అక్కడనుంచి మళ్లీ విజయవాడ వచ్చేశాడు. ఇక భీమవరంలో నామినేషన్ వేసేందుకు హెలికాప్టర్ లో వచ్చాడు. ఇక నుంచి హెలికాప్టర్ లోనే సుడిగాలి పర్యటనలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఓవైపు డబ్బులు లేవు - పేద పార్టీ అని చెప్పే పవన్.. ఇప్పుడు హెలికాప్టర్ లో తిరిగేంత డబ్బు ఎక్కడనుంచి వచ్చిందని వైసీపీ ప్రశ్నిస్తోంది. మరోవైపు పవన్ కు అయ్యే ఎన్నికల ఖర్చు మొత్తం టీడీపీ నేతలే భరిస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. కానీ పవన్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ప్రచారంలో హెలికాప్టర్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు.