ప్రస్తుతం లండన్ లో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. భారత్ లో పెట్టుబడికి అవకాశాలన్న అంశంపై ఆయన ప్రసంగించారు. ఇండో యూరోపియన్ ప్రకటించిన ఎక్స్ లెన్స్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే.
తనకొచ్చిన అవార్డును నిస్వార్థంగా సేవలు చేస్తున్న ప్రతి భారతీయుడికి అంకితం చేస్తున్నట్లుగా ప్రకటించారు పవన్. భారత్ లో పెట్టుబడికి ఉన్న అవకాశాల మీద ప్రసంగించిన పవన్.. భిన్నత్వానికి నిదర్శనం భారత్ అని.. ధనవంతులు.. పేదవాళ్లు ఇద్దరికి దేశంలో చోటు ఉందన్నారు.
భారత్ లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నట్లుగా చెప్పారు. అంతకు ముందు లండన్ లోని అంబేడ్కర్ స్మారక మందిరాన్ని పవన్ సందర్శించారు. మిగిలిన ప్రముఖులకు భిన్నంగా ఆయన అక్కడ వ్యవహరించారు. అంబేడ్కర్ కు సంబంధించిన అరుదైన ఫోటోల్ని చూసేందుకు వీలుగా కిందకు వంగి కూర్చొని మరీ ఆసక్తిగా చూశారు. కొన్ని ఫోటోల్ని తన దగ్గరున్న చిన్న కెమేరాతో తీసుకున్నారు. అంబేడ్కర్ స్మారక మందిరాన్ని సందర్శించిన సమయంలో పవన్ ఎగ్జైటింగ్ గా ఉండటం కనిపించింది.