పవన్ కాకినాడ సభకు పేరు పెట్టేశారు

Update: 2016-09-04 15:56 GMT
ఉద్యమానికి భావోద్వేగం ప్రాణం. అదెంత ఎక్కువ ఉంటే.. ఉద్యమం అంత ఎక్కువగా ప్రజల్లోకి వెళుతుంది. ఆ విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా మొదటికే మోసం వస్తుంది. ఈ విషయాన్ని జనసేనాధిపతి గుర్తించినట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదా మీద తన వాణిని వినిపిస్తూ.. మూడు దశల్లో హోదా సాధన కోసం ఉద్యమం చేస్తానని చెప్పిన జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్  తదుపరి సభ కాకినాడలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న కాకినాడలో జరిగే భారీ బహిరంగ సభకు పేరు పెడుతూ నిర్ణయం తీసుకున్నారు.

రోజు వ్యవధిలో నిర్వహించిన తిరుపతి బహిరంగ సభకు భిన్నంగా.. కాకినాడలో నిర్వహించే సభను భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తున్న పవన్.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. తన పుట్టిన రోజు కూడా కాకినాడ సభ గురించి తన ఫామ్ హౌస్ లో చర్చలు జరిపిన ఆయన.. సభను ఎలా నిర్వహించాలన్న అంశంపై భారీ కసరత్తు చేస్తున్నారు. కాకినాడ సభకు ‘‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’’ అన్న పేరును ఖరారు చేశారు.

కాకినాడ సభలో తానేం చెప్పదలుచుకున్నది.. తన సందేశం ఏమిటన్న విషయాన్ని సభకు పెట్టిన పేరుతో స్పష్టంగా అర్థమ్యేలా పవన్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ పేరిట నిర్వహించనున్న సభకు పెట్టిన పేరే పవర్ ఫుల్ గా ఉన్న నేపథ్యంలో.. సభలో పవన్ మాటలు మరెంత పవర్ ప్యాక్ తో ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News