సెలబ్రిటీల వ్యవహారం చాలా చిత్రంగా ఉంటుంది. వారి ఇమేజ్ ను పెంచే ప్రశ్న వేస్తే ఎంతో ఆనందంగా సమాధానం చెబుతుంటారు. అదే సమయంలో వారిని ఇరుకున పెట్టే ప్రశ్న వేస్తే చాలు.. వారి ముఖంలో రంగులు వెంటనే మారిపోతాయి. ఒక్క సెలబ్రిటీల విషయంలోనే కాదు రాజకీయ నేతల విషయంలోనూ ఇలాంటి పరిస్థితి. ఇక.. రాజకీయ అధినేతల విషయానికి వస్తే ఈ వ్యవహారం మరింత భిన్నంగా ఉంటుంది. వివాదాస్పద అంశాలు.. ఇరుకున పెట్టేలా ప్రశ్నలు సంధిస్తుంటే.. వారిని అడ్డుకునే ప్రయత్నం జరగటం మామూలే.
ఇదంతా ఒక ఎత్తు అయితే గడిచిన పదేళ్లలో తెలుగు రాజకీయాల్లో వచ్చిన మార్పు ఏమిటంటే.. తమను ఇరుకున పెట్టేలా ప్రశ్నించే వారిని.. మీడియా ప్రతినిదులకు ఏదో ఒక రంగు(తమ ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు)ను పూసేసి.. వారిపై విరుచుకుపడతారు. మీడియా ప్రతినిధులను అయితే.. నువ్వే ఛానల్ అంటూ ప్రశ్నించి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా అడిగిన ప్రశ్నకు కాకుండా.. సంబంధం లేని సమాధానం చెబుతారు. అడిగిన ప్రశ్నకు.. చెప్పిన సమాధానానికి సంబంధం లేదన్న మాటను చెప్పే సమయానికి చేతిలో ఉండాల్సిన మైకు ఉండదు. మొండిగా మైకు పట్టుకుంటే.. వ్యక్తిగత విమర్శలు చేసి బద్నాం చేసే ప్రయత్నం చేస్తారే తప్ప.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడరు.
విధానాల విషయంలోనే ఇలా ఉంటే.. వ్యక్తిగత అంశాల విషయం మీద మాట్లాడటం అస్సలు ఉండదు. పవన్ కల్యాణ్ ను తీవ్రంగా వ్యతిరేకించే వారంతా తరచూ ఒక ప్రశ్న వేస్తుంటారు. ఆయన చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ ఎటకారం చేసుకోవటం కనిపిస్తుంది. తాజాగా గుత్తిలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన పవన్ ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ.. తనకు పెళ్లి మీద అస్సలు ఇంట్రస్ట్ లేదని.. సన్యాసం తీసుకొని హిమాలయాలకు వెళ్లాలని అనుకున్నట్లు చెప్పారు.
ఇలాంటి మాటల వెంటనే.. మరి మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నట్లో అన్న ప్రశ్న వచ్చే అవకాశాన్ని గుర్తించిన ఆయన.. దానికి తనకుతానే బదులిస్తూ.. తాను పెళ్లి చేసుకోవాలని అనుకోకున్నా.. ‘‘అలా పెళ్లిళ్లు జరిగిపోయాయి. ప్లాన్ చేయలేదు’’ అని వ్యాఖ్యానించినప్పుడు విద్యార్థుల నుంచి స్పందన భారీగా ఉండటం గమనార్హం. ఇలా తనకు సంబంధించి ఒక వ్యక్తిగత విషయాన్ని ఓపెన్ గా మాట్లాడటం పవన్ లాంటోడికి మాత్రమే సాధ్యమవుతుందేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/