యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్న జ‌న‌సేనాని!

Update: 2018-05-09 10:35 GMT
ఇక‌పై సీరియ‌స్ పాలిటిక్స్ కు సిద్ధం. మ‌ధ్య‌లో బ్రేక్ అంటూ ఏమీ ఉండదంటూ ఆ మ‌ధ్య‌న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. ఓవైపు సినిమాలు.. మ‌రోవైపు రాజ‌కీయాలు అంటూ రెండు ప‌డ‌వ‌ల మీద కాళ్లు వేసే విష‌యంపై కొంత‌కాలం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డిన ప‌వ‌న్‌.. త‌ర్వాత తాను పూర్తిగా రాజ‌కీయాల‌కే ప‌రిమితం కావాల‌ని డిసైడ్ కావ‌టం తెలిసిందే.

సంప్ర‌దాయ పార్టీల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌న‌సేన‌.. రోటీన్ కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. త‌న ఫోక‌స్ అంతా రాజ‌కీయాలేన‌ని చెబుతున్న‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ పెద్ద‌గా బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఏపీ యాత్ర‌కు ప‌వ‌న్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా వార్త‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ఏపీ రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాలు క‌వ‌ర్ అయ్యేలా యాత్ర‌కు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నార‌ని.. దీనికి సంబంధించి షెడ్యూల్ తుది ద‌శ‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. యాత్ర ఎప్పుడు.. ఎక్క‌డ స్టార్ట్ కావాలి.. ఎక్క‌డ ఎండ్ కావాలి? అన్న దానిపై క‌స‌రత్తు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ యాత్ర‌లో పార్టీ విధానాలు.. పార్టీ ఇచ్చే హామీల్ని ఎప్ప‌టిక‌ప్ప‌డు ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు.

త‌న యాత్ర‌కు సంబంధించిన వివ‌రాల్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వ‌యంగా ప్రెస్ మీట్ పెట్టి ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది.  ఈ యాత్ర కోసం ప్ర‌త్యేకంగా ఒక వాహ‌నాన్ని సిద్ధం చేయిస్తున్న‌ట్లుగా స‌మాచారం. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌టం.. జ‌న‌సేన భావ‌జాలాన్ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌టంతో పాటు.. మిగిలిన పార్టీల‌కు భిన్న‌మైన విధానాలు త‌మ‌వ‌న్న విష‌యాన్ని అర్థ‌మ‌య్యేలా చెప్పాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. స్థానిక స‌మ‌స్య‌ల్ని ఎక్క‌డిక‌క్క‌డ గుర్తించి.. వాటి ప‌రిష్కారాల్ని ప‌వ‌నే స్వ‌యంగా చెప్ప‌నున్న‌ట్లుగా స‌మాచారం.

వివిధ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వంపై ఒత్తిడిని పెంచ‌టం.. ఇందుకు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు కాస్త ముందే ఈ ప‌ర్య‌ట‌న పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నార‌ని.. ఏపీ రాష్ట్రం మొత్తం పోటీ చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్న వేళ పార్టీని స‌మాయుత్తం చేసేందుకే తాజా యాత్ర‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.


Tags:    

Similar News