ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ, మిత్రపక్షమైన జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో పవన్‌ను పలువురు నేతలు లైట్ తీసుకున్న కామెంట్లు చేయగా....అప్పట్లో రాజకీయవర్గాలను ఆశ్చర్యపర్చేలా చేసింది. ``ఎన్నికల్లో గెలిపించిన మిత్రపక్షాన్ని తెలుగుదేశం పార్టీ గౌరవించే తీరు ఇదేనా?`` అంటూ సందేహాలు వ్యక్తం చేసేలా సాగింది. ఆ సమయంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని పవన్‌పై విమర్శలు చేయవద్దని పార్టీ నేతలకు సూచించారు. అయితే తాజాగా ఏపీ మంత్రి పితానీ సైతం పవన్ పై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే.
పవన్ గురించి ఆలోచించే టైం తమకు లేదని...తమ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని మంత్రి పితాని మీడియాతో మాట్లాడుతూ తేల్చేశారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం నాయకులపై సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ గురించి ఆలోచించేంత తీరిక లేదు అన్న మంత్రి పితాని టేక్ ఇట్ ఈజీ కామెంట్ పై పవన్ పంచ్ లు వేశారు. ``గతంలో కేంద్ర మంత్రి అశోకగజపతిరాజుకు పవన్ కల్యాణ్ అంటే ఎవరో కూడా తెలియదని వ్యాఖ్యానించారు కానీ మంత్రి పితానికి నేనెవరో తెలుసు. అందుకు సంతోషంగా ఉంది`` అని పవన్ ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అవమానించినట్లు వ్యవహరించినప్పటికీ పవన్ మాత్రం వ్యూహాత్మకంగా వారి కామెంట్లను వారికే తిప్పికొట్టాడని అంటున్నారు.
కాగా, ఈ ఏడాది మేలో పవన్ పలు అంశాలపై ట్వీట్ లు చేసిన సమయంలో వాటిపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించిన``పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు. అతను సినిమా నటుడంటా! నేను సినిమాలు చూసి 20 ఏళ్లయింది`` అని ఎద్దేవా చేశారు. సౌమ్యుడిగా పేరున్న అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలు ఇటు టీడీపీలో అటు జనసేన వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. దానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా మంత్రి పితాని స్పందించడం గమనార్హం.