జగన్ కు మద్దతు.. జనసేన ఎమ్మెల్యేపై పవన్ సీరియస్

Update: 2020-01-21 06:47 GMT
ఏపీ అసెంబ్లీలో జనసేన వాయిస్ ను వినిపించే ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఈయన తాజాగా తన అధినేత పవన్ కళ్యాణ్ కే షాకిచ్చారు. జనసేన వ్యతిరేకిస్తున్న 3 రాజధానులకు అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపి  సొంత పార్టీకి జలక్ ఇచ్చారు. అంతేకాదు సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. దీంతో రాపాక వరప్రసాద్ చర్యలపై జనసేన సీరియస్ అయ్యింది.

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ స్టాండ్ కు విరుద్ధంగా జగన్ కు జైకొట్టడంపై జనసేన సీరియస్ అయ్యింది. ఆయనపై క్రమశిక్షణా చర్యలకు పార్టీ సిద్ధమవుతోంది.

జనసేన ఎమ్మెల్యే కు తొలుత షోకాజ్ నోటీసులు పంపించాలని.. ఇచ్చే వివరణను బట్టి చర్యలు తీసుకోవాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో జనసేన తన ఏకైక ఎమ్మెల్యేపై కఠిన చర్యలకు నిర్ఱయం తీసుకుంది. రాపాకపై ఉదాసీనత వ్యక్తం చేస్తే మిగతా నేతలు అలుసుగా తీసుకుంటారని ఆయనపై చర్యలు తీసుకోవాలని పీఏసీ నిర్ణయించింది.

తాజాగా పవన్ కళ్యాణ్ సైతం అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే రాపాక తీరు , తీసుకున్న నిర్ణయాలు గర్హనీయమైనవని.. ఆయన చర్యలను పార్టీ ఖండిస్తోందని ప్రకటన విడుదల చేశారు. రాపాక పార్టీ సిద్ధాంతాలు విధానాలు ఉల్లంఘించినందున ఆయనపై చర్యలకు దిగుతామని హెచ్చరించారు.


Tags:    

Similar News