హీరో పవన్ కల్యాణ్ తన గురించి తాను కాస్త అతిగా ఊహించుకుంటున్నట్లుగా కనిపిస్తోందని.. పలువురు భావిస్తున్నారు. గుంటూరు సభలో ఆయన ప్రసంగాన్ని గమనించిన పిమ్మట... ఇలాంటి అభిప్రాయం కలుగుతోందని అంటున్నారు. తానొక మహానుభావుడినని - తనను చూసి అందరూ జడుసుకుంటున్నారని.. తనకు సాటి లేదని పవన్ భావిస్తున్నట్లుగా ఉన్నదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోది.
2014 ఎన్నికల్లో భాజపా - తెదేపాలకు అనుకూలంగా ప్రచారం చేసినందుకు వారిని గెలిపించింది తానే అనే స్థాయిలో బిల్డప్ ఇచ్చే పవన్ కల్యాణ్ నిన్న చెప్పిన మరో డైలాగు ఇలాంటి చర్చకు అవకాశం ఇస్తోంది.
తాను వీరికి అనుకూలంగా ప్రచారం చేసినందుకు ఒకవేళ యూపీఏ - వైసీపీ అదికారంలోకి వచ్చి ఉంటే గనుక.. తన మీద దాడులు జరిగి ఉండేవేమో అని.. బహుశా తనని చంపేసి ఉండేవారేమో అని కూడా పవన్ సభలో పేర్కొన్నారు.
ఈ మాటలు వింటే పవన్ తన గురించి తాను అతిగా ఊహించుకుంటున్నట్లు ఉన్నదని పలువురు అంటున్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీని గెలిపించినందుకు ఉపయోగపడిన వారిని అధికారంలోకి వచ్చిన పక్షాలు చంపుకుంటూ వెళ్లేట్లయితే.. ఈ దేశంలో ఇప్పటికి ఎన్నెన్ని రాజకీయ హత్యలు జరిగి ఉండాలి.. పవన్ కల్యాణ్ మాటలు తన గురించి సినిమా స్క్రిప్టు లాగా ఆలోచించుకుంటున్నట్టుగా ఉన్నాయని జనం ఎద్దేవా చేస్తున్నారు. పవన్ వల్ల ఏదో కాసిని కులం ఓట్లు పడి ఉండొచ్చు గానీ.. అంత మాత్రాన చంపేస్తారా అనే వాదన కూడా ఉంది.
పైగా మోడీ ఖచ్చితంగా గెలుస్తాడని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం జరగబట్టి.. కాబోయే ప్రధానితో అంటకాగితే.. తనకు వైభవదశ ఉంటుందనే స్వార్థంతోనే పవన్ వెళ్లి.. ఆయనతో డీల్ కుదుర్చుకుని.. వారికి అనుకూలంగా ప్రచారం చేశారే తప్ప.. మరోటి కాదని అంటున్నారు. పదవులు స్వీకరించలేదని ఆయన అంటున్నారు గానీ.. వాస్తవంలో ఆయనకు ఎవరూ పదవులు ఇవ్వలేదనే మాట వినిపిస్తోంది.
ఆ ఎన్నికల ప్రచారానికి యూపీఏ గెల్చి ఉంటే.. తన మీద దాడులు తప్పవని అంటున్నప్పుడు.. ఇప్పటి ప్రచారానికి ఈసారి తెదేపా - వైసీపీల్లో ఎవరు గెలిచినా దాడులు చేయాలి కదా - చంపేయాలి కదా.. అసలు అలా జరుగుతుందా? పవన్ లాంటి సినిమా నటుడిని ఎవరు పట్టించుకుంటారు గనుక..? అంటూ ప్రజలు నవ్వుకుంటూ ఉండడం విశేషం.