ప‌వ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌: 2019లో ప్ర‌భుత్వ ఏర్పాటు

Update: 2018-05-20 08:55 GMT
అధికారం మీద ఆశ లేదు.  ఆ మాట‌కు వ‌స్తే.. అలాంటి భావ‌న‌ను పెద్ద‌గా బ‌య‌ట‌పెట్ట‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తొలిసారి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌జాస‌మస్య‌ల్ని తెలుసుకోవ‌టం.. ప్ర‌జ‌ల‌కు సాయంగా ఉండ‌టం.. అణ‌గారిన వ‌ర్గాల‌కు గొంతులా నిల‌వ‌ట‌మే త‌ప్పించి.. ప్ర‌భుత్వ ఏర్పాటు మీద మాట్లాడ‌ని ప‌వ‌న్‌.. తొలిసారి ప్ర‌భుత్వ ఏర్పాటుపై త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పారు.

2019లో తాము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 2019లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌న్న ఆయ‌న‌.. పెద్ద‌ల ఆశీస్సుల‌తో.. యువ‌త మ‌ద్ద‌తుతో.. అక్కాచెల్లెళ్ల తోడుతో వ‌చ్చే ఏడాది జ‌రిగే  ఎన్నిక‌ల్లో తాము ప‌వ‌ర్లోకి వ‌స్తున్న‌ట్లుగా చెప్పారు.

మిగిలిన పార్టీల మాదిరి త‌మ‌ది కులాల వారీగా చీల్చే పార్టీ కాద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. శ్రీ‌కాకుళం జిల్లాలో ఈ రోజు స్టార్ట్ చేసిన పోరాట‌యాత్ర సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను ఓట్లు అడ‌గ‌టానికి రాలేద‌ని.. ప్ర‌జ‌లు ఎదుర్కంటున్న స‌మ‌స్య‌ల్ని తెలుసుకోవ‌టానికి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. తాను ప‌ర్య‌టిస్తున్న శ్రీ‌కాకుళం జిల్లా దేశ‌భ‌క్తికి నిలువెత్తు రూప‌మ‌ని.. క‌ష్టానికి ప్ర‌తీక అని పేర్కొన్నారు.

తాను ఉద్దానం స‌మ‌స్య‌ను  ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్లినా.. అది అసంపూర్తిగా మిగిలింద‌న్నారు. శ్రీ‌కాకుళంలో వ‌ల‌స‌ల్ని నియంత్రించే బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని చెప్పారు. తాను హామీలు ఇవ్వ‌టానికి రాలేద‌ని.. జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌నుకుంటే ముందు స‌మ‌స్య‌లు తెలుసుకోవాల‌న్న ఉద్దేశంతో వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న కోస‌మే తాను యాత్ర‌ను చేప‌ట్టిన‌ట్లుగా వెల్ల‌డించారు.

స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌టానికి పోరాట యాత్ర చేప‌ట్టిన ప‌వ‌న్.. హామీలు కూడా ఇవ్వ‌టానికి రాలేద‌ని చెప్ప‌టం ఓకే. మ‌రి.. స‌మ‌స్య‌లు ఇంకా తెలుసుకోకుండానే 2019లో ప్ర‌భుత్వ ఏర్పాటు మీద మాట ఎలా చెప్పేసిన‌ట్లు? అన్న‌ది ప్ర‌శ్న‌. తాను ఎక్క‌డికి వెళ్లినా.. త‌న చుట్టూ ఉన్న వారంతా.. అదే ప‌నిగా సీఎం.. సీఎం అంటున్న వేళ‌.. అభిమానుల నినాదాలు ప‌వ‌న్ మ‌న‌సుపై ప్ర‌భావాన్ని చూపించాయా? అవే.. ప‌వ‌న్ చేత తాజా వ్యాఖ్య చేసేలా చేశాయా? అన్న‌ది ప్ర‌శ్న‌. పార్టీలో ప‌ట్టుమ‌ని ప‌ది మంది నేత‌లు లేని వేళ‌.. అప్పుడు ప్ర‌భుత్వ ఏర్పాటు గురించి మాట్లాడ‌టం తొంద‌ర‌పాటు అవుతుందేమో ప‌వ‌న్ జీ?
Tags:    

Similar News