జనసేనాని పవన్ ఏపీలో విస్తృత పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ప్రజలతో మమేకమవుతున్నారు. తాజాగా కడపలో విద్యార్థులతో ఆయన భేటి అయ్యారు. విద్యార్థుల నుంచి పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం వల్ల వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కావని.. సంపూర్ణ మద్య నిషేధం అమలయ్యేలా చూడాలని పవన్ ను ప్రశ్నించారు విద్యార్థులు.
దీనిపై పవన్ స్పందించారు. ‘తాను తూర్పుగోదావరిలో మీటింగ్ పెట్టి సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని అనగానే వెనుకాల నుంచి కొందరు వద్దంటూ చేతులు ఊపారని.. పవన్ అంటే తమకు ఎంతో ఇష్టంకానీ మద్యం షాపులు మాత్రం బ్యాన్ చేయొద్దని తనను కోరారని’ పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
మద్యం విషయంలో ప్రభుత్వ అసమర్థతను పవన్ ఎండగట్టారు. విదేశాల్లో ఏమూలకైనా మద్యం షాపులు - బార్లు ఉంటాయని.. కానీ అక్కడ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని అందుకే అక్కడ మద్యం తాగి రోడ్ల మీదకు రారని పవన్ చెప్పుకొచ్చారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వారి లైఫ్ టైం డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారని.. ఉద్యోగాల్లోంచి తీసేస్తారని.. అందుకే మద్యం తాగి రోడ్డు ఎక్కాలంటేనే విదేశీయులు భయపడిపోతారని పవన్ వివరించారు. అంతటి కఠిన చట్టాలు దేశంలో ఉంటే ఈ పరిస్థితే రాదని తెలిపారు.
తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తానని పవన్ హామీ ఇచ్చారు. దీన్ని మనస్ఫూర్తిగా పాటిస్తానని తెలిపారు. తననుంచి ఎక్కువ అద్భుతాలు ఆశించవద్దని ఒక్కరోజులో అన్నీ అయిపోవని.. నాకు చేతనైనంత ఖచ్చితంగా చేస్తానంటూ పవన్ వివరించారు.
రాష్ట్రంలో పూర్తి మధ్యనిషేధం సాధ్యం కాదని పవన్ తేల్చిచెప్పారు. ఏపీలో నిషేధిస్తే తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తెచ్చి భారీ ధరలకు అమ్ముతారని.. ఇదో మాఫియాలాగా అవుతుందని పవన్ హెచ్చరించారు. దానికో మార్కెట్ తయారై రౌడీయిజం పెరుగుతుందన్నారు. నాడు ఎన్టీఆర్ మద్య నిషేధం విధించినప్పుడు ఇలానే స్మగ్గింగ్ లాగా వ్యవస్థ తయారైందన్నారు. సికింద్రాబాద్,కంటో న్మెంట్ కు వెళ్లి ఆర్మీ మద్యం కోసం జనం ఎగబడ్డ వ్యవహారాన్ని పవన్ చెప్పుకొచ్చారు. ఈ రోజు సంపూర్ణ మద్య నిషేధం సాధ్యం కాదని పవన్ కుండబద్దలు కొట్టారు.
ఇక తాను అధికారంలోకి వస్తే లిక్కర్ పాలసీని కఠినతరం చేస్తానని పవన్ అన్నారు. ఎవరైనా తాగి రోడ్ల మీదకు వస్తే జైల్లో పెట్టడం లాంటి కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. ఆడ పిల్లల జోలికి వస్తే తిరిగి మాట్లాడకుండా.. బయటకు రాకుండా తన్నిలోపల వేయాలని.. ఇంట్లో తాగాలి కానీ.. బయటకు వచ్చి పిచ్చి వేషాలు వేస్తే మక్కెలు ఇరగ్గొడతాం అంటూ పవన్ హెచ్చరించారు. అలాంటి బలమైన చట్టాలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. చట్టాలు చేసిన తర్వాతే మద్యం గురించి మాట్లాడుతానని వివరించారు.