జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ వివిధ అంశాలపై తన అజ్ఞానాన్నిప్రదర్శిస్తున్నాడా?... అంటే విమర్శకుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇలా ఒకసారి.. రెండుసార్లు కాదు ప్రతిసారీ ఇలాగే జరుగుతోందని విమర్శకులు అంటున్నారు. ఇప్పటికే పార్ట్ టైం పొలిటీషియన్‌గా పేరు పడిపోయిన పవన్... తన నైజాన్ని మార్చుకునే విషయాన్ని పక్కనపడేసి... చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తూ అవతలి వారికి అవకాశం ఇస్తున్నారని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ ఒక్క అంశం మీదా స్పష్టమైన వైఖరిని ప్రకటించని పవన్ కల్యాణ్... తాను స్పందించే అంశాలపై కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తే ఎలాగంటూ విమర్శల జడి వాన కురుస్తోంది.
అయినా అసలు విషయం చెప్పకుండా ఈ సోది అంతా ఎందుకంటారా? అయితే... విషయంలోకి వెళదాం. మూడు రోజుల కిందట బెంగళూరులో ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన లంకేష్ మృతిపై ఇప్పటికే అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు స్పందించారు. లంకేశ్ హత్యను ఖండించారు. విద్యార్థి, యువ లోకం అయితే ఏకంగా రోడ్లెక్కి మరీ నిరసనలు తెలుపుతోంది. ఒక్క కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ లంకేశ్ హత్యను నిరసిస్తూ ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంపైనా స్పందించే విషయంలో పవన్ తాత్సారమే చేశారన్న వాదన వినిపిస్తోంది.
లంకేశ్ హత్య జరిగిన రెండు రోజులకు గానీ తీరిక దొరకని పవన్ గురువారం ట్విటర్ లో ఆమె హత్యను ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా..కనీసం గౌరీ లంకేశ్ పేరును కూడా సరిగా తెలుసుకోకుండానే పవన్ స్పందించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. ఏదేనీ విషయంపై స్పందించే ముందు కాస్త ముందూ వెనుకూ చూసుకోవాలన్న కనీస అవగాహన లేకుండానే పవన్ స్పందించారని, ఈ క్రమంలో ఆయన మరోమారు తప్పు చేసి దొరికిపోయారన్న వాదన వినిపిస్తోంది. అయినా పవన్ చేసిన తప్పేమిటన్న విషయానికి వస్తే... గౌరీ లంకేశ్ పేరుకు బదులుగా గౌరీ శంకర్ అని పవన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక్కడే చిక్కు వచ్చి పడింది. దీంతో పవన్ అజ్ఞానాన్ని చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకున్నారు.
హత్య జరిగిన రెండు రోజుల తర్వాత ఆలస్యంగా స్పందించడమే కాకుండా పైగా పేరు తప్పు రాయడంతో ఆయన పరిజ్ఞానంపై అందరికీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా గతంలోనూ ప్రత్యేక హోదాపై నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ ఒక కవి పేరు తప్పుగా పలికిన సంగతిని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. ఆ సభలో మాట్లాడుతూ 'ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని' అని కవిత చదివి ఇది రాసింది గురజాడ అప్పారావు అని చెప్పడంలో విస్తుపోవడం సభికుల వంతైంది. వాస్తవానికి ఈ కవిత రాసింది రాయప్రోలు సుబ్బారావు. ఇప్పుడు కూడా అదేవిధంగా గౌరీ లంకేశ్ పేరును గౌరీశంకర్ గా పేర్కొనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే... జరిగిన తప్పును కాస్తంత ఆలస్యంగా గుర్తించిన పవన్... తన ట్వీట్‌లో ప్రస్తావించిన పేరును గౌరీ శంకర్‌గా కాకుండా గౌరీ లంకేశ్ గా చదువుకోవాలని పవన్ మరో ట్వీట్ చేశారు. అయితే అప్పటికే జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. పవన్ ట్వీట్లను చూసిన నెటిజన్లు... పేర్లు తెలియకుండానే స్పందిస్తారా? పవన్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే తనపై వెల్లువెత్తిన విమర్శలకు ఏమాత్రం నొచ్చుకోకుండానే పవన్ జరిగిన తప్పును గుర్తించి పేరు సరిచేసుకోవాలంటూ మరో ట్వీట్ చేయడం ఆహ్వానించదగ్గ విషయమేనన్న వాదన వినిపిస్తోంది.