కొండ కిక్కిరిసింది.. అన్నవరంలో పవన్ కోసం అభిమానుల పరుగులు

Update: 2023-06-14 15:00 GMT
జనసేనాని కమ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన వస్తున్నారంటే చాలు.. జనాలు పోటెత్తుతారు. ఇక.. అభిమానుల హడావుడికి అడ్డే ఉండదు. రానున్న ఎన్నికలకు ప్రచారాన్ని షురూ చేసేందుకు భారీ ప్లాన్ వేసుకున్న పవన్ కల్యాణ్.. అందుకు తగ్గట్లే వారాహి పేరుతో ఒక భారీ వాహనాన్ని సిద్ధం చేయించుకోవటం తెలిసిందే.

ఇంతకాలం షెడ్డులో ఉన్న వారాహి.. ఈరోజు (బుధవారం) అన్నవరం సత్యదేవుడి ప్రాంగణంలో పూజలు పూర్తి చేసుకొని రోడ్డు ఎక్కనున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర - పది గంటల ప్రాంతంలో వారాహికి పూజలు నిర్వహించారు.

సత్యదేవుడ్ని సందర్శించటం కోసం పవన్ కల్యాణ్ అన్నవరం కొండకు వచ్చారు. పవన్ కల్యాణ్ వస్తున్న విషయంపై ముందస్తుగానే సమాచారం ఉండటంతో.. ఆయన అభిమానులు.. జనసైనికులు.. వీర మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు.

దీంతో.. అన్నవరం కొండ మొత్తం పవన్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. పవన్ ను చూసేందుకు.. ఆయన ప్రయాణిస్తున్న కారుతో సమానంగా పరుగులు తీస్తున్న వైనం జనసేనానిపై తమకున్న అభిమానాన్నిప్రదర్శించే ప్రయత్నం చేశారు. అన్నవరం కొండకు చాలామంది ప్రముఖులు వచ్చారు కానీ.. కొండ దారి మొత్తం కిక్కిరిసిపోయిన సందర్భాలు అరుదన్న మాట పలువురి నోట వినిపిస్తుండడటం విశేషం.

Similar News