పార్టీ ఏదైనా అధినేతలకు.. నేతలకు ఉండే సెంటిమెంట్లు అన్నిఇన్ని కావు. కొన్నిసార్లు తమ ప్రమేయం లేకున్నా సంప్రదాయాన్ని.. స్థానికంగా ఉండే సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా ఆ జాబితాలో చేరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో ప్రముఖ రాజకీయ పార్టీ అధినేతలు బస చేసే అలవాటు ఉంది. తుని పర్యటనకు వచ్చిన వారంతా.. దగ్గర్లోని అన్నవరం కొండకు వెళ్లి.. అక్కడి సత్యగిరి కొండపైన ఉన్న రత్నగిరిలో బస చేయటం మామూలే.
గతంలో చంద్రబాబు.. తర్వాతి కాలంలో చిరంజీవి.. ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ జగన్ లు ఇదే రీతిలో వ్యవహరించారు. తాజాగా వారిని ఫాలో అయ్యారు పవన్ కల్యాణ్. తుని పర్యటనకు వచ్చిన ఆయన.. సభ ముగిసిన తర్వాత సత్యగిరి కొండపై కేటాయించిన సీతా అతిథిగృహంలో ఆయన బస చేశారు. అయితే.. ఎలాంటి రాజకీయ పదవి లేని కారణంగా పవన్ నుంచి అద్దె వసూలు చేశారు దేవస్థానం అధికారులు.