ఆత్మసాక్షిని అడగండి? పవన్ లా మాట్లాడే పార్టీ అధినేత తెలుగు నేల మీద మరొకరు ఉన్నారా?
చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటం. ఒక మాట నోటి నుంచి వచ్చే ముందు ఆ మాట కారణంగా లాభం కంటే నష్టమే ఎక్కువన్న కనీస ఆలోచన అవసరం. ఇలాంటి సోయి ఉన్నోళ్లు మాట్లాడే ప్రతి మాటలోనూ మర్యాద ఉంటుందన్నది మర్చిపోకూడదు. కానీ.. సమకాలీన రాజకీయాల్లో మర్యాద అన్నది మర్చిపోయి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడేసే ధోరణి ఇటీవలకాలంలో ఎక్కువ అవుతుంది.
అందునా జనసేన అధినేత పవన్ ను ఉద్దేశించి మాట్లాడటం కూడా ఎక్కువైంది. దీనికి కారణం.. పవన్ కల్యాణే తీరే. ఆయన్ను ఎవరైనా ఏమైనా అంటే.. పోన్లో పాపం.. మనల్ని నాలుగు మాటలు అనటం ద్వారా మైలేజీ పొందుతున్నారన్న పాజిటివ్ కోణమే తప్పించి.. ఆ వెంటనే విరుచుకుపడాలన్న ధోరణి తక్కువ. ఈ కారణంతోనే ఆయన సాఫ్ట్ కార్నర్ అయ్యారని చెప్పాలి.
దీనికి తోడు పవన్ ను అన్నంతనే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వచ్చేయటం.. ఆయన్ను ఎన్ని అన్నా తిరిగి అనే మాటలు బాధ్యతగా ఉంటాయే తప్పించి.. నోటికి వచ్చినట్లుగా చిల్లర మాటల్ని మాట్లాడటం చేయడు. అంటే..పవన్ ను అదే పనిగా మాట అనేవాడికి రెండు లాభాలు. ఒకటి.. పవన్ తిడుతున్నారన్నంతనే బోలెడంత ప్రచారం. మరోవైపు పవన్ నుంచి ఎంతో రేర్ గా తప్పించి అదే పనిగా రియాక్షన్ అంటూ రాదు. దీంతో.. మాట అని కూడా మాట అనిపించుకోకుండా ఉండే అవకాశం ఉండటంతో పవన్ ను ఉద్దేశించి మాట్లాడటం ఈ మధ్యన ఎక్కువ అయ్యింది. దీంతో పవన్ సైతం తనను టార్గెట్ చేసిన వారి లెక్కలు తేల్చే ధోరణిని షురూ చేశారని చెప్పాలి.
ఇన్నిచేసి కూడా.. బాధ్యతగా మాట్లాడటం.. రాష్ట్రం మీద తనకున్న ప్రేమాభిమానాల్ని తన మాటలతో ప్రదర్శిస్తుంటారు పవన్ కల్యాణ్. తాజాగా రణస్థలంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. ఈ తరహాలో బాధ్యతగా మాట్లాడే అధినేత తెలుగు నేల మీద దొరుకుతాడా? అన్నది ప్రశ్న. రాజకీయం అన్నంతనే ఇప్పటికున్న అర్థాన్ని మార్చేసి.. నిజంగానే ప్రజలకు సేవ చేయాలన్న తపనతో మాట్లాడే మాటలుగా పవన్ వి కనిపిస్తాయి. రణస్థలంలో ఆయన చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని చూస్తే.. ఇలాంటి నేత ఒకరు ఏపీకి అవసరమన్న భావన కలుగక మానదు.
పవన్ వ్యాఖ్యల్లో అండర్ లైన్ చేసుకోవాల్సిన కొన్ని వ్యాఖ్యల్ని చూస్తే..
- యువతరానికి ఏం సంపద వదిలిపెట్టాం? యుద్ధం, రక్తం, కన్నీరు తప్ప.. గాయాలు, బాధలు, వేధనలు తప్ప.. కలలు తప్ప.. పిరికితనం మోసం తప్ప.. ఒక దేశపు సంపద నదులు కాదు.. అరణ్యాలు కాదు. ఖనిజాలు కాదు. కలల ఖనిజాలతో చేసిన యువత.
- చేతికి చేతి కర్ర కావాల్సిన రోజు వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుంది. ఒక తరం పెరుగుతూ వయసు వచ్చేస్తుంటే భావితరం తాలూకు విలువ తెలుస్తుంది. ఇప్పుడున్న నాయకులు వారి బిడ్డల కోసం ఆలోచిస్తున్నారు. మీ తరం కోసం మీ బిడ్డల కోసం ఆలోచించడం లేదు. నేను ఇన్ని కోట్ల మందికి తెలిసి ఉండొచ్చు. అయినా నేను సగటు మధ్య తరగతి వ్యక్తినే. సామాన్యుడినే.
- నాకు నటనలో ఓనమాలు నేర్పింది ఉత్తరాంధ్రే. ఉత్తరాంధ్ర ఆట, పాట, కవిత, కళ, నాకు నటన నేర్పిన గురువు ఉత్తరాంధ్రే. ఏం పిల్లడో ఎల్ద మొస్తవా అన్న వంగపండు స్ఫూర్తితో నటన నేర్చుకుంటున్న సందర్భంలో నాకు రాజకీయ సామాజిక చైతన్యం నేర్పిన నేల ఇది. ఆ చైతన్యం ఉత్తరాంధ్రలో వచ్చింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న స్టీల్ ప్లాంట్ లో పని చేసే ఉద్యోగులు చాలా మంది నటన నేర్చుకునే సమయంలో నాకు అండగా ఉండే వారు.
- నేను తిట్టడానికి మీటింట్ పెట్ట లేదు. నాకున్నది సగటు మనిషి ఆలోచన. కొంత మంది ఎందుకో ప్రత్యేక పరిస్థితుల్లో పుడతారు. విద్య, వైద్యం, ఉపాధి కొంత మందికే ఎందుకు దొరుకుతాయి? కష్టం వస్తే ఈ శాఖలు సాయం ఎందుకు చేయవు. దేశం ఎందుకు సాయం చేయదు. అన్న కోపం ప్రతి సగటు మనిషిలో ఉంటుంది. నేనూ అలాంటి సగటు మనిషినే. మన దేశం.. మహనీయుల త్యాగాలు నాలో బాధ్యత పెంచాయి. దేశ భక్తిని పెంచాయి. కష్టజీవులకు అండగా ఉండమని చెప్పాయి
- సినిమాల్లో రెండున్నర గంటల్లో సమస్యలు తీర్చేయొచ్చు. నిజ జీవితంలో ఉద్దానం సమస్య ఇప్పటికీ తీర్చలేదు. రాష్ట్ర విభజన జరిగిన తీరు చూసి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నాదగ్గర ఎవరూ లేదు. ఇంత సమూహం నా వెంట ఉంటారని తెలియదు. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు అందరిలాగా మెటికలు విరుస్తూ కూర్చోవాలా.. నా దేశం కోసం సమాజం కోసం ముందుకు రావాలా.. అని ఆలోచించినప్పుడు మహా అయితే నా ప్రాణం పోతుంది. కానీ ఒక సత్యాన్ని బలంగా మాట్లాడిన వాడినవుతాను అనిపించింది.
- నాకు పిరికితనం చిరాకు. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా? అన్న సిద్ధాంతాన్ని పాటించే వాడిని.
- నాకు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జీవితం ధైర్యం నేర్పింది. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో శ్రీ శ్రీ గారి మహాప్రస్తానం నేర్పింది. ఒక రావి శాస్త్రి, ఒక చాసో ఇలాంటి ఎందరో మహానుభవుల్ని చదివాను. శ్రీకాకుళం నేల ఎంత గొప్పదో గిడుగు రామ్మూర్తి గారి జీవితమే ఉదాహరణ.
- శ్రీ గిడుగు రామ్మూర్తి గారు గిరిజనుల కోసం, సవరల కోసం చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. వినలేనితనంతో తెలుగు భాష ఉద్యమం కోసం పాటుపడిన మహానుభావుడు. చివరి దశలో ఒక రచయిత అయి ఉండి పలాస రాజు గారితో గొడవ పెట్టుకుని వీధి పోరాటాలు చేశారు. అలాంటి ఆయనకు మోకరిల్లి నమస్కరిస్తున్నా. రాజకీయాల్లోకి రావడానికి ఇలాంటి మహానుభావులే కారణం.
- స్వామి వివేకానంద గారు 30 ఏళ్ల వయసులో చనిపోయారు. శ్రీ భగత్ సింగ్ 23 ఏళ్ల వయసులో ప్రాణత్యాగం చేశారు, శ్రీ ఆజాద్ 25 సంవంత్సరాలకు చనిపోయారు. వీరు మన కోసం రక్తం చిందిస్తే మనం ఏం చేస్తున్నాం? నేను డబ్బులు, పేరు సంపాదించి అందరిలాగే ఉంటే ఎలా అన్న ఆలోచనే నాతో పార్టీ పెట్టించింది. నాకు తెలిసిందల్లా పోరాటం చేయడమే. ఎదవల్ని బాగా ఎదుర్కోవడం తెలుసు.
- మట్టిపాత్రలో అన్నం పెడితే తింటా.. అన్నం లేకపోతే పస్తులుంటా.. సినిమాలు లేకపోతే మూసుకు కూర్చుంటా.. విజయాలు వస్తే పొంగిపోయి అపజయాలు వస్తే కుంగిపోను. నేను నా నేల కోసం వచ్చా.. మాట్లాడితే కాపులు నన్ను నమ్మకూడదంటున్నారు. నేను కులనాయుకుడ్ని కాదు. నేను ఒక కులం కోసం వచ్చిన వాడిని కాదు. నా అంధ్రప్రదేశ్.. నా తెలంగాణ.. నా దేశం.. నా తెలుగు ప్రజల బాగు కోసం వచ్చా. నా కాపు కులం మాత్రమే బాగుండాలని కోరుకోలేదు. అందరూ బాగుండాలని కోరుకున్నా.
- ఏ రోజు కుల ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. కులాల ఐక్యత అన్నానంటే ఒక కులాన్ని పెంచడానికి కాదు. వైసీపీ వాళ్లు ఒక్క కులానికే చేసుకుంటున్నారు. ఒక్క కులంతో పదవులన్నీ నింపేసుకుంటున్నారు. నా వరకు నేను నా కులం నా పక్కన నిలబడకపోతే ఓటమికి సిద్ధం తప్ప కులాల మధ్య చిచ్చుపెట్టి గెలవను.