ఇదంతా వెంకయ్య గురించి పవన్ చెప్పిందే

Update: 2022-08-10 05:45 GMT
దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉండి.. కార్యకర్త స్థాయి నుంచి దేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉప రాష్ట్రపతి పదవి వరకు ఎదగటం అందరికీ సాధ్యం కాదు. అందునా.. ఉత్తరాది వారికి పెద్దపీట వేసే బీజేపీ లాంటి పార్టీలో.. తనకు తానుగా ఎదగటం వెంకయ్య లాంటి వారికి మాత్రమే సాధ్యపడుతుంది.

అలాంటి ఆయన తన పదవీకాలం ముగిసిన నేపథ్యంలో.. ఆయనను అభినందించే క్రమంలో చాలామంది చాలా చెప్పారు కానీ.. జనసేన అధినేత పవన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు మాత్రం.. మిగిలిన వారికి భిన్నమని చెప్పాలి. ఆయన రాజకీయ ప్రయాణాన్ని అతి తక్కువ మాటల్లో అన్ని అంశాల్ని కవర్ చేసేలా ఉన్న ఆయన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పక తప్పదు.

తాజాగా ఉప రాష్ట్రపతి పదవికి పదవీ విరమణ చేసిన వెంకయ్య నాయుడుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు.. అతి తక్కువ మాటలతో వెంకయ్య సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ఎంత సిం'పుల్'గా చెప్పా రో అన్న భావన కలుగక మానదు. ఇంతకూ వెంకయ్య గురించి పవన్ ఏం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చూస్తే.

'ఏ పదవి చేపట్టినా.. వన్నె తెచ్చిన నాయకుడు వెంకయ్య నాయుడు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించి, అత్యవసర పరిస్థితిని ఎదిరించారు. ఆరు నెలల పాటు జైలు జీవితం మొదలుకుని ఇప్పటి ఉపరాష్ట్రపతి పదవి వరకు వెంకయ్యనాయుడు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో అనుభూతులు ఉన్నాయి. అయిదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏ పదవీ లేకుండా ఆయన ఎప్పుడూ లేరు. వెంకయ్య రాజకీయ మేధావి' అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ఆయన మరికొన్ని మాటల్లో వెంకయ్య రాజకీయ ప్రస్థానాన్ని చెప్పుకొచ్చారు. 'ఇటు శాసన సభ, అటు రాజ్యసభల్లో ఆయన చేసిన ప్రసంగాలు ప్రతీ ఒక్కరిని ఆలోచింపచేశాయి. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై వెంకయ్య నాయుడుకు ఉన్న పట్టు, వాగ్ధాటి ప్రతి ఒక్కరినీ సమ్మోహనపరుస్తాయి.

ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసి ప్రజలతో మమేకం కావటానికి సమాయత్తమవుతున్న తరుణంలో వెంకయ్య నాయుడుకు నా హార్దిక శుభాకాంక్షలు' అంటూ  పవన్ నోటి నుంచి వచ్చిన మాటల్ని చూస్తే.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దిగ్గజ నేత జీవన ప్రయాణాన్ని ఎంత బాగా చెప్పారో అని అనుకోకుండా ఉండలేం.
Tags:    

Similar News