ప‌వ‌న్ వ‌ర్సెస్ నాని.. మ‌ళ్లీ పేలిన తూటాలు!

Update: 2022-12-09 13:00 GMT
వైసీపీ నేత‌ల‌కు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతూనేఉన్నాయి. రాజకీ యంగా  ప‌వ‌న్ చేసే వ్యాఖ్య‌ల‌కు వైసీపీ నేత‌లు కౌంట‌ర్ ఇవ్వ‌డం.. ప‌వన్ రీ కౌంట‌ర్ ఇవ్వ‌డం ఇటీవ‌ల కాలంలో ష‌రా మ‌మూలే అన్న‌ట్టుగా మారిపోయింది. ఈ క్ర‌మంలో ఓ వారం గ్యాప్ తీసుకున్న ఇరు ప‌క్షాలు.. తాజాగా మ‌రోసారి పొలిటిక‌ల్ తూటాలు పేల్చాయి. మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్ల‌పై ప‌వ‌న్ హాట్‌గా రియాక్ట్ అయ్యాడు.

పేర్ని నాని ఏన్నారంటే..

ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్న విష‌యం తాజాగా వెలుగు చూసింది. దీనిని స్వ‌యంగా ప‌వనే త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. అయితే.. దీనికి సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఈ వాహనానికి నిషేధిత రంగు వేశార‌ని అన్నారు. ``ల‌క్ష పుస్త‌కాలు చ‌దివాన‌ని చెప్పే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇంకొక్క పుస్త‌కం చ‌దివితే బాగుంటుంది.. ల‌చ్చ‌న్నోక్క పుస్త‌కం అవుతుంది`` అని పేర్ని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

అదేంటంటే.. భార‌త మోటార్ వెహిక‌ల్ చ‌ట్టం ప్ర‌కారం.. దేశంలో ఒక్క సైనికులు వినియోగించే వాహ‌నాల కు త‌ప్ప ఇత‌రులు ఎవ‌రూ కూడా ఆలివ్ గ్రీన్ రంగుతో కూడిన వాహ‌నం వినియోగించుకునేందుకు అనుమ‌తి లేద‌ని న్నారు.

ఈ విష‌యం పాపం ప‌వ‌న్‌కు తెలియ‌దేమో.. అందుకే ఆ పుస్త‌కం కూడా చ‌దువుకుంటే బాగుంటుంద‌ని అన్నారు. అంత‌టితో ఆగ‌కుండా.. ఎలానూ ప‌చ్చ రంగు ఏసేస్తే.. బెట‌ర్‌.. ఎన్నిక‌ల‌కు ముందు ఎలానూ బాబుతో చేతులు క‌లుపుతారు క‌దా! అని మ‌రో వ్యంగ్యాస్త్రం విసిరాడు.

అయితే.. దీనికి కౌంట‌ర్‌గా ప‌వ‌న్ తాజాగా మాట‌ల తూటాలు పేల్చారు.  ``ముందుగా నా సినిమాలను అడ్డుకున్నారు. విశాఖ వెళ్తే హోటల్‌ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. విశాఖ నుంచి బలవంతంగా పంపించేశారు. మంగళగిరిలో నా కారులో వెళ్తుంటే అడ్డుకున్నారు. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న నన్ను ఆపేశారు. ఇప్పుడు వాహనం రంగుపైనా వివాదం చేస్తున్నారు. కనీసం ముదురు ఆకుపచ్చ చొక్కా అయినా వేసుకోవచ్చా`` అంటూ ట్వీట్‌ చేశారు. ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా? అని ప్ర‌శ్నించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News