రాజకీయాల్లో వన్ సైడ్ లవ్ ఉంటుందని, అది సరైన టైమ్ లో పండుతుందని చంద్రబాబు ధీమాగా ఉన్నారు. ఆర్య సినిమాలో హీరో అల్లు అర్జున్ ఎలాగైతే క్లైమాక్స్ లో తన వన్ సైడ్ లవ్ ని గెలిపించుకున్నారో అలాగే పాలిటిక్స్ లో కూడా చంద్రబాబు సక్సెస్ అవుతారు అనే అంటున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో జనసేనతో టీడీపీ పొత్తు ఫిక్స్ అని తెలుగుదేశం తమ్ముళ్ళు భావిస్తున్నారు కానీ జనసేన విషయం తీసుకుంటే ఇప్పటికిఅయితే తాము బీజేపీతోనే అని అంటున్నారు.
ఇక టీడీపీ అధినాయకత్వం విషయానికి వస్తే చాలా ముందు చూపుతో వ్యవహరిస్తోంది. పొత్తు కుదిరితే అప్పటికపుడు ఇబ్బంది పడకుండా సీట్ల పంపకం సాఫీగా జరిగేలా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతోంది. ముఖ్యంగా జనసేనకు పట్టున్న గోదావరి, విశాఖ జిల్లాలలో టీడీపీ ఆ పార్టీకి అనుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటోంది.
విశాఖ అర్బన్ జిల్లా విషయానికి వస్తే జనసేన భీమునిపట్నం, విశాఖ తూర్పు, ఉత్తరం, గాజువాకల నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. పొత్తులు ఉన్నా లేకపోయినా కూడా పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. దానికి తగినట్లుగానే టీడీపీ కూడా అక్కడ తమ ఇన్ ఛార్జీల విషయంలో అచీ తుచీ ఎంపిక చేసుకుంటోంది.
భీమిలీలో మాజీ ఎంపీపీ కోరాడ రాజబాబుని నియమించారు. ఇక్కడ సీనియర్ నేతలు ఉన్నా కూడా రాజబాబుకు ఇవ్వడం వెనక పొత్తులు ఉంటే ఆయనను స్మూత్ గా పక్కన పెట్టేవచ్చు అన్న ముందస్తు ఆలోచన ఉందని అంటున్నారు. అలాగే విశాఖ తూర్పు విషయం తీసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు ఉన్నారు. ఆయనకు ఈసారి టికెట్ డౌట్ అంటున్నారు.
అదే టైమ్ లో కొత్త వారిని కూడాఎవరినీ ఇక్కడ గుర్తించలేదు. అంటే ఇక్కడ జనసేన సీటు కోరిందే ఆలస్యం అన్నట్లుగా అప్పగిస్తారు అన్న మాట. విశాఖ నార్త్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన మరోసారి పోటీ ఇక్కడ నుంచి పోటీ చేసే చాన్స్ లేదని అంటున్నారు. ఇక టీడీపీ ఇక్కడ కూడా సీరియస్ గా పాలిటిక్స్ చేయడంలేదు. జనసేనకు బలమున్న సీటు కాబట్టి పొత్తులో ఇచ్చేస్తే పోతుంది అని భావిస్తున్నారుట.
గాజువాకలో ఏకంగా పవన్ కళ్యాణే 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి ఆయన పోటీకి దిగకపోవచ్చు కానీ బలమైన నాయకులే ఆ పార్టీ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి అక్కడ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నారు. అయితే ఆయనకు ఎంపీగా పోటీ చేయించి జనసేనకు సానుకూలం చేస్తారని అంటున్నారు. మొత్తానికి విశాఖ అర్బన్ జిల్లా వరకూ చూసుకుంటే జనసేన ఈ సీట్లు అన్నీ అడిగితే బంగారు పళ్లెంలో పెట్టి మరీ అప్పగించడానికి టీడీపీ రెడీగా ఉంది అంటున్నారు.
మరో వైపు చూసుకుంటే టీడీపీతో పొత్తు లేకుండా జనసేన ఒంటరిగా ఇక్కడ పోటీ చేసినా బీజేపీతో పొత్తుతో బరిలోకి దిగినా కూడా ఆ పార్టీకి ఎక్కువ శాతం ఓట్లు రావచ్చు కానీ గెలుపు విషయం మాత్రం కొంత డౌట్ అంటున్నారు. దాంతో ఆ పార్టీ కూడా అన్నీ ఆలోచించి చివరి నిముషంలో పొత్తుకు సై అంటుందనే మాట ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.