మీ వైఫ‌ల్యాల‌ను వారిపై నెడ‌తారా? వైసీపీపై జ‌న‌సేనాని ఫైర్

Update: 2022-06-08 09:32 GMT
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పదో తరగతి విద్యార్థులను ఫెయిల్ చేశారని.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ఈ విష‌యంలో వైసీపీదే నేర‌మ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగులను ఎలానూ సంతోషపెట్టలేని ప్రభుత్వం.. కనీసం పిల్లలకు సరైన చదువైనా చెప్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా అని నిలదీశారు. గ్రేస్ మార్కులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పదో తరగతి విద్యార్థులను ఫెయిల్ చేశారని.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. గ్రేస్ మార్కులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని కోరారు. ఉచితంగా రీ-కౌటింగ్ నిర్వహించాలని..సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు తీసుకోకూడదని డిమాండ్‌ చేశారు.

ప్రజలు, రైతులు, నిరుద్యోగులను ఎలానూ సంతోషపెట్టలేని ప్రభుత్వం.. కనీసం పిల్లలకు సరైన చదువైనా చెప్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా అని నిలదీశారు.

విద్యార్థులు ఫెయిలైతే తల్లిదండ్రులపై నెపం వేయడాన్ని తప్పుపట్టారు. ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే తల్లుల పెంపకం సక్రమంగా లేదని..కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే అతను రైతేకాదని తిమ్మిని బమ్మిని చేస్తున్నారని మండిపడ్డారు.

వైకాపా సర్కారు వాదనలు వింటుంటే.. అసహ్యం కలుగుతోందన్నారు. నాడు-నేడు పేరుతో పాఠశాలలకు రంగులేస్తున్నాం, ఇంగ్లీషులో బోధిస్తున్నాం అంటే సరిపోదని తగినంతమంది బోధన సిబ్బందిని నియమించాలని సూచించారు.

అరకొర ఉన్న టీచర్లకు మద్యం షాపులు వద్ద డ్యూటీలు వేసిన ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశించాలని పవన్‌ ప్రశ్నించారు. వారికే అన్ని ప‌నులు అప్ప‌గిస్తే.. మిగిలిన వారు ఏం చేస్తున్నార‌ని.. నిల‌దీశారు. క‌నీసం ప్ర‌భుత్వానికి చీమ కుట్టిన‌ట్టు కూడా లేద‌ని.. ఇంత జ‌రిగి.. విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నా.. ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. మండిప‌డ్డారు. ఇప్ప‌టికైనా.. చేసిన త‌ప్పులు స‌రిదిద్దు కోవాల‌ని.. ప‌వ‌న్ సూచించారు. మ‌రి స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News